చిట్టి నాయుడు సినిమాలు చూడటం తగ్గించుకో..

నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌ రెడ్డి

నంద్యాల:  నారా లోకేష్‌ అలియాస్‌ చిట్టినాయుడు సినిమాలు చూడటం తగ్గించుకోవాలని ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌ సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదన్నారు. గడ్డం పెంచినంత మాత్రానా హీరో కాలేవు..నిన్ను చూసి ఎవరూ బయపడిపోరు. లోకేష్‌ మర్యాదగా మాట్లాడితే..నీకు మర్యాద ఇస్తాం. అవాక్కులు చెవాకులు పేల్చితే చూస్తూ ఊరుకోమన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన మీకు మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టాలని, వారిని ఏమీ తెలియదనుకుంటున్నాడు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే నీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top