జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులు నిండాయి

రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే
 

కావాలి నియోజకవర్గంలో నీళ్లొచ్చే అవకాశం ఉంది. ఉత్తర కాల్వ ద్వారా నీళ్లు ఇవ్వాలి. వైయస్ జగన్ పాదయాత్ర సమయంలో కావలి వచ్చే సమయానికి నాటి టీడీపీ ప్రభుత్వం ఆదరాబాదరాగా ఒక కాల్వ తవ్వి చెరువులోకి నీళ్లిచ్చింది. తర్వాత పట్టించుకోవడం మానేసింది.
జగన్ గారు సీఎం అయ్యాక చక్కని వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు నిండాయి. అయితే మా గ్రామాల దిగువన ఉన్న 7 చెరువులు నిండాలంటే అక్కడ 2.5 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని కాల్వలు తవ్వుకోడానికి ఇస్తే ఆ చెరువులన్నీ నిండి గ్రామాలకు మేలు జరుగుతుంది. దీన్ని అటవీ శాఖ అబ్జెక్ట్ చేస్తోంది. మంత్రిగారు, ఇరిగేషన్ శాఖా మంత్రిగారు, ముఖ్యమంత్రిగారు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. కావలి కాల్వకు 12 tmcలు ఇస్తున్నా రావాల్సిన నీరు రావడం లేదు. కదిరి కెనాలు ఒక మీటర్ డౌన్ లో ఉంది. దానివల్ల నీరు కిందకెళ్లిపోయి మాకు అన్యాయం జరుగుతోంది. సంగం బ్యారేజీ కడతామన్నారు కనుక. దాని నుంచి సపరేట్ గా కావలి కాలవకు నీరొచ్చేలా చేయాలని కోరుతున్నాను.  

Back to Top