డిసెంబర్‌ 23 చరిత్రలో లిఖించదగ్గ రోజు

దివంగత మహానేత వైయస్‌ఆర్‌ కలలు నెరవేరబోతున్నాయి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు సాకారం అవుతున్నాయని, ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాజోలి రిజర్వాయర్, జోలదరాశి రిజర్వాయర్, కుంధూ నది నుంచి తెలుగుగంగకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే  రఘురామిరెడ్డి అన్నారు. డిసెంబర్‌ 23 చరిత్రలో లిఖించదగ్గ రోజు అన్నారు. నేలటూరులో సీఎం వైయస్‌ జగన్‌ ఈ మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ  సభలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడారు.. ఆయన ఏం మాట్లారంటే.. ‘మన కలలు సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రాజోలి రిజర్వాయర్, జలదరాశి రిజర్వాయర్, కుంధూ నుంచి తెలుగుగంగకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్‌ను ఈ రోజు అన్ని రకాల పూర్తి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలే కాదు.. ప్రకృతి కూడా ఆశీర్వదించింది. శ్రీశైలం మూడు సార్లు, నాగార్జునసాగర్‌ నిండింది. నేటికీ మనం కేసీ కెనాల్‌లో నీరు చూస్తున్నామంటే నిజంగా వైయస్‌ఆర్‌ కలలు నెరవేరబోతున్నాయి. 2008 డిసెంబర్‌ 23వ అప్పటి సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజోలి, జోలదరాశి ప్రాజెక్టులకు జీఓ 244 ఇచ్చి శంకుస్థాపన చేశారు. దాదాపు 11 సంవత్సరాలు అయ్యింది. ముగ్గురు కృష్ణులు మారారు.. మొదటి కృష్ణుడు రోశయ్య, రెండో కృష్ణుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, మూడో తెల్లవారు జామున కృష్ణుడు చంద్రబాబు పోయాడు.. వారు ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. మాట చెబితే కచ్చితంగా నిలబడే కుటుంబం వైయస్‌ఆర్‌ కుటుంబం. మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దాదాపు 2,200 కోట్ల రూపాయలు మైదుకూరు, బద్వేల్‌ నియోజకవర్గాలకు సస్యశ్యామలం చేయడానికి కేటాయించడం నిజంగా గొప్ప విషయం. ఈ మూడు ప్రాజెక్టులు మూడు సంవత్సరాల్లో పూర్తవుతాయి. రైతులంతా రెండు పంటలు వేసుకొని సంతోషంగా ఉంటారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పారు.

మైదుకూరు నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కేసీ ఉల్లిపాయలు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపించాలని సీఎంను కోరారు. మైదుకూరు మున్సిపాలిటీలో సమస్యలు, గ్రామీణ లింకు రోడ్డు నిర్మాణం, మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయాలని, మైదుకూరులో కూడా పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని, చాపాడు మండలంలో నాడు – నేడు కార్యక్రమం ద్వారా హైస్కూల్‌ను అప్‌గ్రేడ్‌ చేసి జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని, బ్రహ్మంగారి మఠంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మించాలని సీఎంను కోరారు.

 

తాజా వీడియోలు

Back to Top