టీడీపీది అధర్మ యుద్దం  

మీడియా పాయింట్ వ‌ద్ద‌ ఎమ్మెల్యే రాచమల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి

అమ‌రావ‌తి: టీడీపీ వారు ధర్మ యుద్ధం చేయాల్సింది పొయి అధర్మ యుద్దం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి విమ‌ర్శించారు. బుధ‌వారం మీడియా పాయింట్ వ‌ద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. 

  • ప్రొద్దుటూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నాను.
  • గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము
  • 500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాము
  • ఏబీఎన్, టీవీ-5, ఈనాడు పత్రికలు టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్నాయి
  • టీడీపీ వారు ధర్మ యుద్ధం చేయాల్సింది పొయి అధర్మ యుద్దం చేస్తున్నారు
  • మా కౌన్సిలర్లను 20 మంది వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు
  • నలుగురు కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 12 లక్షల 50 వేలు డబ్బు ఆశ చూపారు
  • టీడీపీ వారు చేస్తున్న ప్రలోభాలను మా కౌన్సిలర్లు తిరస్కరించారు.
  • టీడీపీ అభ్యర్థి ఎంపిక కోసం 30 కోట్లు అడుగుతున్నారు
  • వైయ‌స్ఆర్‌సీపీలో ప్రజాసేవలో ఉండేవారినే అభ్యర్థిగా ప్రకటించారు
Back to Top