ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి  

 ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

ఎమ్మెల్యే రాచముల్లు శివప్రసాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కుల స్కాం కేసులో తన పాత్ర ఉందని పోలీసులు, సీఐడీ అధికారులు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ స్కాంలో తన పాత్ర లేదని తేలితే ఆంధ్రజ్యోతి పత్రికను మూసివేస్తావా అంటూ ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణకు ఆయన సవాల్‌ విసిరారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రజ్యోతి పత్రిక సీబీఐ దర్యాప్తు కోరితే తాను మొదటి సంతకం చేస్తానని కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top