మెగా పీపుల్ సర్వే కార్యక్రమం ఒక చరిత్ర

 ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి  

వైయస్ఆర్ జిల్లా: మెగా పీపుల్ సర్వే కార్యక్రమం ఒక చరిత్ర అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కమలాపురం వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో సోమ‌వారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వ‌స్తుంద‌ని చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం దిగ్విజ‌యంగా సాగుతుంద‌న్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మెగా పీపుల్ సర్వేలోని తొలి 14 రోజుల్లో కోటి కుటుంబాలు సందర్శించి సర్వే చేయడం జరిగిందని చెప్పారు. ఈ మెగా పీపుల్ సర్వేలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటికి వెళ్లి సందర్శించార‌ని తెలిపారు. ఒక్క కమలాపురం నియోజకవర్గంలో 72, 150 కుటుంబాల కు గాను 52,351 కుటుంబాలు సందర్శించి సర్వే చేశారు.  ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారని అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు నమోదు చేశామ‌న్నారు. కోటి కుటుంబాలు సర్వే చేయగా జగనన్న పాలనకు మద్దతుగా 78 లక్షల 68 వేల కుటుంబాలను మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చక రాష్ట్ర ప్రజలు నష్టపోయార‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వ మేనిఫెస్టో వెబ్ సైట్ నుంచి తొలగించే పరిస్థితి వచ్చేసింద‌న్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాగా భావించి 98.5% హామీలను నెరవేర్చిన ఘనత వైయస్ జగన్‌ది అన్నారు. కుల మత వర్గ వివక్ష లేకుండా వైయ‌స్ జగన్ కు మద్దతు తెలిపారు.  2014- 19 ఉన్న ప్రభుత్వం దేశంలోనే అవినీతి ప్రభుత్వం. ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం  భారత దేశంలోనే మంచి పరిపాలన అందిస్తున్న నెంబర్ వన్ ప్రభుత్వమ‌న్నారు.   కరోనా కష్టకాలంలో కూడా హామీలన్నీ నెరవేరుస్తూ చక్కటి పరిపాలన అందించిన ప్రభుత్వం వైయ‌స్ జ‌గ‌న్‌దే అన్నారు. కరోనాలో భారత దేశంలోనే అతి తక్కువ మరణాలు జరిగిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.  ప్రభుత్వ పరిపాలన అంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువ చేసింది.  ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కనుకే ప్రజల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంద‌న్నారు.  పేదల ఇంటి కలను సాకారం చేస్తూ 31 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత వైయస్ జగన్.  ప్రభుత్వ భూమే కాకుండా 6, 668 ఎకరాలను ప్రైవేట్ ల్యాండ్ సేకరించి ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్ జగన్ ది.   ప్రతి నెల ఒకటవ తేదీ పింఛను పొందుతున్న వృద్ధులు వికలాంగులు ఆశీస్సులు వైయస్ జగన్ కు నిండుగా కనిపిస్తున్నాయ‌న్నారు.

Back to Top