చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?

 ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

 గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలపై ఐటీ సోదాలు జరిగిన ఆయన ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. శుక్రవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో టీడీపీ ప్రభుత్వం చేసిన వేల కోట్ల అవినీతిని కూడా బయటకు తీయాలి అని కోరారు. అక్రమాలు బయటకు రాకూడదనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతిచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. అవినీతి పరుడికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ఆయా పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మరొక అంశాన్ని చంద్రబాబు తెరమీదికి తెస్తారని.. అయితే అలాంటి జిమ్మిక్కులకు కాలం చెల్లిందని తెలిపారు.  

తాజా ఫోటోలు

Back to Top