నాడు మీరు అనుమతులు ఇచ్చిన లేట్ రైట్.. నేడు  బాక్సైట్ అయ్యన్నా...

నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

విశాఖ:  టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో అనుమ‌తులు ఇచ్చిన లేట్‌రైట్ ఇవాళ బాక్సైట్ అయ్యిందా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడిని ప్ర‌శ్నించారు.  నాడు మీరు ఇచ్చిన అనుమతులతోనే నేడు  కోర్టు అనుమతులుతో మైనింగ్ జరుగుతున్న విషయం అయ్యన్నకు తెలియదా ?.. అని నిల‌దీశారు. విశాఖ ఏజెన్సీలో అడ్డుగోలుగా మైనింగ్ చేసింది అయ్యన్నపాత్రుడేన‌ని పేర్కొన్నారు.  శ‌నివారం పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్ మీడియాతో మాట్లాడుతూ..వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం లేట్ రైట్ తవ్వకాలకు అనుమతులు కొత్తగా ఇవ్వలేదని  స్ప‌ష్టం చేశారు. బినామీలా పేరుతో లక్షల కోట్లు అర్జించిన అయ్యన్నపాత్రుడు నేడు రంకెలు వేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు అండతో లోకేష్ బినామీ ఆండ్రు మినరల్స్ విశాఖపట్నంలో కొండలను లూటీ చేయలేదా.? అని నిల‌దీశారు.

అయ్యన్న రాజకీయ స్వార్ధంతోనే  ఏజెన్సీ పర్యటన చేస్తున్నార‌ని గ‌ణేష్ మండిప‌డ్డారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో లేట్ రైట్ ను వ్యతిరేకించిన గిరిజనులపై అక్రమ కేసులు, హత్యహత్నం చేయిచింది అయ్యన్న అనుచరులు కదా? అని ధ్వ‌జ‌మెత్తారు. అయ్యన్న బినామీ తవ్వకాలపై వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఫైన్ వేసింది నిజం కాదా అని గుర్తు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top