ప్రజల ఆశలకు అద్దం పెట్టేలా బడ్జెట్‌..

బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది

చంద్రబాబు పెట్టుబడుదారులు గురించి మాత్రమే ఆలోచించారు..

పేదల పట్ల చంద్రబాబు సానుభూతితో వ్యవహరించలేదు

గత ఐదేళ్లలో పేదలు తీవ్రంగా నష్టపోయారు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

అమరావతిః  చంద్రబాబు పెట్టుబడుదారులు గురించి మాత్రమే ఆలోచించారని పేదల కోసం ఆలోచించలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రావడం కోసమే హామీలు ఇవ్వాలనే దక్ఫథంతో ఆలోచించకపోవడం వైయస్‌ జగన్‌ ప్రత్యేకత అని తెలిపారు.వైయస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల కోసమే ఆలోచించారని తెలిపారు..ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా పెట్టుబడుదారులు,పారిశ్రామిక వేత్తల సమావేశాలంటూ చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. చంద్రబాబు..విదేశీ పర్యటనలు తప్ప రైతులు, ప్రజలు గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు.గత ఐదేళ్లలో రైతులు,అణగారిన వర్గాలు తీవ్ర అన్యాయానికి గురి అయ్యారన్నారు.పరిపాలనకు కావాల్సింది కేవలం అనుభవమే కాదు. రాష్ట్రం,ప్రజలు,పేద వర్గాల పట్ల సానుభూతి కావాలన్నారు.

చంద్రబాబులో సానుభూతి లోపించింది. దీంతో గత ఐదేళ్లలో పేదలు తీవ్రంగా నష్టపోయారు.స్వార్థపూరిత ఆలోచనలు,తప్పుడు ఆలోచనలతో రాష్ట్రం కూడా నష్టపోయిందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచే దిశగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారని తెలిపారు.పేదవర్గాలకే కాకుండా బీసీలు,ఎస్సీలు దృష్టా చూస్తే చరిత్రలో ఎవరూ కూడా ఇటువంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదన్నారు.దేశంలో 50 శాతం బలహీనవర్గాలు ఉన్నారు. రాజ్యాంగ బద్ధంగా వీరికి ఎటువంటి రక్షణ లేదు.ప్రతి రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో బలహీన వర్గాలను రాజకీయ లబ్ధి పొందడానికే ఉపయోగించుకున్నారు తప్ప..ఏనాడూ వారి సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు.బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురాలేదన్నారు.

టీడీపీకి ఎన్నికల సమయంలో మాత్రమే ఎస్సీ,ఎస్టీ,బీసీలు గుర్తుకొస్తారన్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైయస్‌ఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని  బీసీలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు,మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాలను వైయస్‌ జగన్‌ కొనసాగిస్తున్నారన్నారు.ప్రస్తుత బడ్జెట్‌ సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలను ప్రతిబింబిస్తుందన్నారు.బిసీల్లో ప్రతీ కులానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారని తెలిపారు.ఒక సిఇవో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాదని..ప్రజల హృదయాలు తెలుసుకున్న వ్యక్తి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది అని ప్రస్తుతించారు.కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌దన్నారు.బిసి కార్పొరేషన్‌ ద్వారా మహిళలకు రూ.75వేల ఆర్థికసాయం ఇస్తున్నట్లు తెలిపారు.మైనార్టీలపై దేశద్రోహం కేసు పెట్టించిన చరిత్ర చంద్రబాబుదన్నారు.పేద విద్యార్తులు చదువుకోవాలన్న ఆలోచనలతో వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారన్నారు.గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గాలికొదిలేసిందన్నారు.ఈ బడ్జెట్‌లో విద్యకు రూ.33,410 కోట్లు కేటాయించామని తెలిపారు.ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.6500 కోట్లు కేటాయించారని తెలిపారు. 

 

తాజా ఫోటోలు

Back to Top