సంక్షేమ రంగానికి సీఎం వైయ‌స్ జగన్‌ అధిక ప్రాధాన్యత

మంత్రి కొలుసు పార్థసారధి
 

అమ‌రావ‌తి: సంక్షేమ రంగానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌ధి అన్నారు. బలహీనవర్గాలు, దళితుల కోసం వినూత్న రీతిలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని పార్థసారధి విమ‌ర్శించారు. బుధ‌వారం స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బలహీన వర్గాలు, దళితుల కోసం వినూత్న రీతిలో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీలు ఎన్నో ఏళ్లుగా సబ్‌ ప్లాన్‌ కావాలని, 50 శాతం నిధులు కావాలని డిమాండు చేశారని తెలిపారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం  బీసీలకు అధిక శాతం నిధులు కేటాయించింది. అమ్మ ఒడి పథకం ద్వారా రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో రూ.5900 కోట్లు కేవలం బీసీ తల్లులకే ఇచ్చారు. అంటే దాదాపు 48 శాతం బీసీలకు నిధులు కేటాయించినట్లే.  ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షం ఉందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top