చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు..

చారిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడం దారుణం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి

అమరావతిః అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడం హర్షణీయం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బలహీనవర్గాలు, దళితుల ,గిరిజనులు,ౖ మెనార్టీలు తరపున  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బిల్లులు ద్వారా బలహీనవర్గాలు కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించడానికి బీజం  పడిందన్నారు.  ప్రభుత్వాన్ని అభినందించాల్సిపోయి బిల్లులను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనులుగా మిలిగిపోతారని మండిపడ్డారు.గొప్ప బిల్లులను ప్రవేశపెడుతున్న సమయంలో  సూచనలు,సలహాలు ఇవాల్సిందిపోయి..అడ్డుకోవడం దారుణమన్నారు. అవినీతి బయటపడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు రాష్ట్ర చరిత్రను మారుస్తాయని తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top