ముస్లిం మైనారిటీలంతా వైయస్‌ జగన్‌ వెంటే 

గుంటూరు:  ముస్లిం మైనారిటీలంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంటే ఉంటారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరులో శుక్రవారం నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి  ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీల తరఫున కృతజ్ఞతలు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరుపుకోవడం శుభదినం. దేశ స్వాతంత్య్రంలో పోరాటం చేసిన మౌలానాకు దేశ ప్రభుత్వం భారతరత్నతో పురస్కరించింది. ఇలాంటి  గొప్ప వ్యక్తి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు మైనారిటీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మైనారిటీలకు సీట్లు కేటాయించడం, రాజకీయంగా అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్ద పీట వేశారు. మైనారిటీ వర్గానికి చెందిన జకీయ ఖానమ్‌కు మండలి వైస్‌ చైర్‌పర్సన్‌గా స్థానం కల్పించారు. మైనారిటీల పక్షపాతిగా వైయస్‌ జగన్‌ రుజువు చేసుకున్నారు. అరబిక్‌భాషలో చదువుకునే విద్యార్థులకు గుంటూరులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నారు.  మైనారిటీలకు అసెంబ్లీల్లో సముచిత స్థానం కల్పించిన వ్యక్తి వైయస్‌ జగన్‌. దుల్హాన్‌ పథకానికి  మార్పులు తెస్తూ వైయస్‌ జగన్‌ ఎంతో గొప్పగా అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అర్హులందరికీ అందజేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద కుటుంబాల్లోనే పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడేవారు. ఇవాళ పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పిస్తున్నారు. గుంటూరు నగరంలో 67 వేల మందికి ఇళ్లు ఇచ్చారు. మైనారిటీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేసిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో కూడా ముస్లిం మైనారిటీలంతా వైయస్‌ జగన్‌ వెంటే నడవాలని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ముస్లిం  మైనారిటీలను ముస్తఫా కోరారు. 
 

Back to Top