ఉర్దూను రెండో భాషగా గుర్తించడం సంతోషం

సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే ముస్తఫా కృతజ్ఞతలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా గుర్తించడం సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఇందుకు కృషి చేసిన సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడారు.
గుంటూరు నగరంలోని వక్ఫ్‌బోర్డుకు చెందిన 300 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని ఎవరు పడితే వారు ఆక్రమించకుంటున్నారు. మాయబజార్‌లో చాలా ముస్లింలు ఉపాధి పొందుతున్నారు. గతంలో వైయస్‌రాజశేఖరరెడ్డి ముస్లింల జీవితాల్లో వెలుగు నింపారు. అదేవిధంగా  ముస్లింలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ వెలుగు నింపుతున్నారు. మాయబజార్‌లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వారికి జీవనోపాధి కల్పించాలంటే రెడ్డిపాలంలో ఉన్న పొలం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వవచ్చు.

ఆంధ్రపదేశ్‌లో ఉర్దూను రెండో భాషగా గుర్తించడం పట్ల సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. రెండో భాషగా తీసుకురావడం వల్ల రాష్ట్రంతో పాటు, ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందుతూ జీవించవచ్చు. గుంటూరు నగరంలో బ్రహ్మనందరెడ్డి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. 
 

Back to Top