దళితులకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

అమరావతి: దళితులకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులను చంద్రబాబు ఏ ఒక్క రోజు పట్టించుకోలేదని విమర్శించారు. బిల్లులపై నాగార్జున సభలో మాట్లాడారు. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి, దోపిడీకి పర్యాయపదం ఆ రోజు నామినేటేడ్‌ పదవులే అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చారిత్రాత్మక బిల్లులను రూపొందించారన్నారు. భావితరాల బాగోగుల కోసం ఆ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనలతో రూపొందించిన రాజ్యాంగాన్ని మిళితం చేస్తూ వైయస్‌ జగన్‌ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టారన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేషన్‌ పద్ధతిలో పనులు, పదవులు కేటాయిస్తూ బిల్లు రూపొందించారన్నారు. అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా పథకాలు, ఉద్యోగాల నియామకాలు వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. మంచి మనస్సున నాయకుడిగా వైయస్‌ జగన్‌ ప్రతి దాంట్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఎవరూ ఆలోచించని సంస్కరణలు తీసుకువస్తున్నారన్నారు. పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షం ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. అంబేడ్కర్‌ ఆలోచన విధానం తీసుకువచ్చిన వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌ తీసుకువస్తున్న ప్రతి చట్టం ప్రతి ఇంటికి మేలు చేస్తుందన్నారు. కురవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మంత్రిగా నియమించి, ఇంతటి కీలకమైన బిల్లును ప్రవేశపెట్టేలా అవకాశం కల్పించారన్నారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top