సామాజిక న్యాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కొత్త అర్థం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున 

నామినేటెడ్‌ పదవుల్లో కూడా  తగిన ప్రాతినిథ్యం

చంద్ర‌బాబు త‌న‌ మీద తానే రాయి వేసుకుని దుష్ప్రచారం

తాడేపల్లి:  సామాజి్క న్యాయానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త అర్థం తీసుకువ‌చ్చార‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు.  ఆనాడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశించిన సమసమాజ నిర్మాణం  కార్యరూపం దాల్చలేదు. అయితే రాష్ట్రంలో తొలిసారిగా ఆ దిశలో మహానేత వైయస్సార్‌ తన పాలనలో అడుగు వేశారు. నిరుపేదల అభ్యున్నతి, వారికి మెరుగైన వైద్యం, ఉన్నత విద్య అందించడం వంటి అనేక పనులను ఆయన అమలు చేశారు. కిలో బియ్యం రూపాయికే అందించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, మళ్లీ పేదల గురించి పట్టించుకోలేదు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

– ఇవాళ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరిగి ఆ బాటలో నడుస్తున్నారు. సామాజిక న్యాయానికి కొత్త అర్ధం తీసుకువచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రివర్గంలో కూడా పూర్తి ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్‌ పదవుల్లో కూడా వారికి తగిన ప్రాతినిథ్యం కల్పించారు. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వెనకబడిన అనేక కులాల వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారు. చివరకు కాపు మహిళల కోసం కూడా పథకం అమలు చేస్తున్నారు. 

– పేదలు బాగా చదువుకుంటేనే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని నమ్మిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపేలా చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నారు. ఆసరా, చేయూత ద్వారా మహిళల సా«ధికారత కోసం కృషి చేస్తున్నారు. బడులలో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ రోజుకొక మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. పేదలందరికీ సొంత ఇంటి స్థలం ఉండేలా ఏకంగా 31 లక్షల నిరుపేద కుటుంబాల వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. వారికి ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారు. 

– కానీ అదే చంద్రబాబును చూస్తే, దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని ఆయన అన్నారు. ఆయన హయాంలో దళితులపై దాడులు జరిగాయి. ఇవాళ తిరుపతి ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన మీద ఆయనే రాయి వేసుకుని రాళ్ల దాడి అని దుష్ప్రచారం చేస్తున్నారు.

– తిరుపతి ఎస్సీ నియోజకవర్గంలో ఇవాళ పోటీ చేస్తున్న నలుగురిలో ముగ్గురు అత్యంత ధనవంతులు. కానీ వైయస్సార్‌సీపీ అభ్యర్థి ఒక్కరే పేద కుటుంబం నుంచి వచ్చారు.

– పేదల కోసం, దళితుల కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుంటే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు వాటిని తప్పు పడుతూ, తాము అధికారంలోకి వస్తే, వాటన్నింటినీ తీసేస్తామని చెప్పారు. ఇక అదే పార్టీకి చెందిన సునిల్‌ దేవధర్, వైయస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని విమర్శిస్తున్నారు. నీది ఏ మతం? నీవు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నావా? అని అడిగారు. మరి ఇదేనా అంబేడ్కర్‌ ఆశించిన సామాజిక న్యాయం?.

– ఇవాళ ఒక నాయకుడు తిరుపతిలో ధర్నా చేస్తున్నాడు. వివేకానందరెడ్డి హత్యపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నాడు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ విషయం తెలిసి కూడా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. అసలు ఆయన హత్యతో ప్రభుత్వానికి ఏం సంబంధం? వివేకా హత్య గురించి ఆదినారాయణరెడ్డిని, బిటెక్‌ రవిని అడగండి.

– ఇదీ ఆయా పార్టీల వైఖరి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మొదలు పనికిమాలిన లోకేష్‌ వరకు, నడ్డా మొదలు సునిల్‌ దేవధర్‌ వరకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

– అంబేడ్కర్‌ ఆలోచన విధానంలో నుంచి వచ్చిన పార్టీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. నిజమైన అంబేడ్కర్‌ ఆశయాల సాధన, ఆయన ఆశించిన సమ సమాజం కోసం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నామ‌ని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Back to Top