టీడీపీలో గౌరవం లేదు...

వైయస్‌ జగన్‌తోనే దోపిడీ పాలనకు అడ్డుకట్ట..

వైయస్‌ఆర్‌ ఆశయాలు.. జగన్‌తోనే సాకారం..

–మేడా మల్లికార్జునరెడ్డి

హైదరాబాద్‌: కష్టపడి పనిచేసేవారికి టీడీపీలో గౌరవం లేదని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న దోపిడీ అరికట్టాలంటే..దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాల మేరకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలన్నారు. వైయస్‌ జగనే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని అన్నారు.  ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని తెలిపారు.

వైయస్‌ఆర్‌సీపీలోకి చేరేముందు అన్ని పదవులకు రాజీనామా చేసి  పార్టీలోకి చేరాలని వైయస్‌ జగన్‌ తెలిపారని, అలాగే అన్ని పదవులకు రాజీనామా చేయడంతో పాటు.. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలోకి చేరినట్లు తెలిపారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే   ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాలకు వైయస్‌ జగన్‌  ఆదుకుంటారన్నారన్నారు. వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.ఐదేళ్ల కాలంలో ప్రతివర్గాన్ని చంద్రబాబు దగా చేశారన్నారు.ఐదేళ్లలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎన్నికల ముందు మోసపూరిత వాగ్ధానాలతో  ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

Back to Top