ఐటీడీఏ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదు

ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి
 

అసెంబ్లీ: నెల్లూరు ఐటీడీఏ సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సభలో ఆయన మాట్లాడుతూ.. యానాధులకు సంబంధించిన నెల్లూరులో ఐటీడీఏ ప్రాజెక్టు ఉంది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరుజిల్లాలకు ఈ ప్రాజెక్టు సంబంధించినది. ఎప్పుడు కూడా ఈ జిల్లాలతో సమావేశం నిర్వహించడం లేదు. గత ఆరు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహించకుండా ఏకపక్షంగా వచ్చిన నిధులను నెల్లూరు జిల్లాలోనే నిధులు ఖర్చు చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చెప్పాలి. మా ప్రాంతంలో ఉన్న యానాదులు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు ఏవైనా చర్యలు తీసుకున్నారా?

తాజా ఫోటోలు

Back to Top