వైయస్‌ఆర్‌సీపీలోకి ఎమ్మెల్యే మణిగాంధీ

వాల్మీకి పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌ కూడా..
 

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మణిగాంధీ పార్టీలో చేరారు. అలాగే వాల్మీకి పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్, వీఆర్‌పీఎస్‌ నాయకుడు మురళి, తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
 

Back to Top