దేశంలోనే ముందుచూపు ఉన్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: దేశంలోనే ముందు చూపు ఉన్న వ్యక్తి ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.ప్రణాళిక బద్ధంగా పేదలకు నాలుగో విడత ఉచిత రేషన్‌ ఇస్తున్నామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న  81 వేల మందికి రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. లాక్‌డౌన్‌లో సైతం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రూ.500 కోట్లతో మొక్కజొన్న రైతులకు, రూ.1700 కోట్లు విద్యార్థులకు చెల్లించారన్నారు.  విద్యుత్‌ చార్జీలపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. కరెంటు చార్జీలు పెంచలేదని, ప్రతిపక్షాలు అపోహాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్‌ బకాయిలు కూడా మా ప్రభుత్వమే చెల్లించిందన్నారు. దేవినేని ఉమా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మల్లాది విష్ణు హితవు పలికారు.

Back to Top