పరిజ్ఞాన లోపంతో బీజేపీ నేత‌లు అనవసర విమర్శలు  

భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు 

విజయవాడ: పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నార‌ని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజ‌య‌వాడ‌లో మ‌ల్లాది విష్ణు  మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు.  బ్రాహ్మణ కార్పొరేషన్‌లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. 

Back to Top