విద్యుత్‌ బిల్లుల టారిఫ్‌ పెంచినట్లు నిరూపించండి

చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్‌

విజయవాడ: విద్యుత్‌ బిల్లుల్లో టారిఫ్‌ పెంచినట్లు నిరూపించాలని ప్రతిపక్షనేత చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సవాల్‌ విసిరారు. కరోనా కష్టకాలంలో పక్కరాష్ట్రానికి పారిపోయి ఏసీ గదుల్లో కూర్చొని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపాడని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏపీని అప్పులపాలు చేశాడని, గత ప్రభుత్వ బకాయిలను కూడా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుస్తున్నారన్నారు. టీడీపీవి దొంగ దీక్షలని ఆ పార్టీకి చెందిన నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారన్నారు. 
 

Back to Top