విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలో మూడవ బెస్ట్ సీఎంగా వైయస్ జగన్ నిలిచారని తెలిపారు. పేదలు, మహిళలు, రైతుల గురించి చంద్రబాబు ఆలోచించలేదన్నారు. ఏపీని అభివృద్ధి పథకంలో సీఎం వైయప్ జగన్ నడిపిస్తున్నారని తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే విజయమని మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. రూ.600 కోట్లతో విజయవాడ అభివృద్ధి: మంత్రి వెల్లంపల్లి విజయవాడ నగరంలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అధికారంలో ఉన్పప్పుడు చంద్రబాబు అహంకారంతో ప్రజలను విస్మరించారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో దాక్కున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం చంద్రబాబు వీధి నాటకాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తానంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబు బుద్ధి మారలేదని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో జగనన్న చిరస్థాయిగా నిలిచారన్నారు.