విజయవాడలో లక్ష ఇళ్లు ఇచ్చాం

సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ:  విజయవాడ నగరంలో నిరుపేదలకు లక్ష ఇళ్లు ఇచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం విజయవాడ నగరంలో మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు చేరువ చేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను పేదల గడప వద్దకు చేర్చారని చెప్పారు.విజయవాడలో పేదలకు లక్ష ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతో విజయవాడలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. టీడీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో అవినీతి కబంధ హస్తాల్లో రాష్ట్రం నలిగిపోయిందని మండిపడ్డారు. గతంలో కేంద్రం విజయవాడకు ఇచ్చిన రూ.500 కోట్లు చంద్రబాబు తన కంపెనీకి ధారదత్తం చేశారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగుతుందన్నారు. ప్రతి నెల పింఛన్లు వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి కార్యక్రమం అందరికీ అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల పరిష్కారంపైఎక్కువ  దృష్టి పెట్టామన్నారు. మంచి కౌన్సిల్‌ తీసుకుని వచ్చి విజయవాడ నగరంలో సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రజలు కూడా వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top