ఉమా చిట్‌ఫండ్స్‌ బాధితులకు న్యాయం చేయండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

 

అసెంబ్లీ: ఉమా చిట్‌ఫండ్స్‌ కంపెనీ ఆస్తులను వేలం వేసి డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నియమించి బాధితులను ఆదుకోవాలన్నారు. సభలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరంలో ఉమా చిట్‌ఫండ్స్‌ కంపెనీ 2009లో రూ.100 కోట్లతో 3 వేల మంది డిపాజిట్‌దారులను మోసం చేసింది. ఈ కంపెనీలో డిపాజిట్‌ దారులంతా వృద్ధులు, పెన్షనర్లు, నిరుపేదలే. ఈ కేసులో పదేళ్ల నుంచి తీవ్ర జాప్యం జరుగుతుంది. కొంతకాలం జడ్జి లేరని, కొంతకాలం పీపీ లేరని, ఇలా రకరకాలుగా జాప్యం చేశారు. ఈ మధ్యకాలంలోనే 300 డిపాజిట్‌దారులు చనిపోయారు. కంపెనీ నిర్వాహకుడు కూడా చనిపోయారు. ఆస్తులను బహిరంగ వేలం వేసి డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించాలి. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలి. న్యాయశాఖ నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించాలి. పోలింగ్‌ జరుగుతున్న రోజున టీడీపీ ప్రభుత్వం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. డిపాజిట్‌దారుల తరుఫున మాట్లాడాల్సిందిపోయి కంపెనీ యాజమాన్యంకు అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించారు. హైలెవల్‌ అధికారులతో కమిటీ వేసి వెంటనే సమస్య పరిష్కరించాలని మల్లాది విష్ణు కోరారు.

తాజా వీడియోలు

Back to Top