ఫైబర్‌ గ్రిడ్‌..మదర్‌ ఆఫ్‌ స్కామ్స్‌

  ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ ప్రెస్‌మీట్‌

తాడేప‌ల్లి:  టీడీపీ హ‌యాంలో పైబ‌ర్ గ్రిడ్‌లో భారీ అవినీతి అక్ర‌మాలు జ‌రిగాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విమ‌ర్శించారు.  ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌ వేసి.. అర్హతలన్నీ ఉన్నా కూడా మాకు ఇవ్వకుండా ఏ అర్హత లేని కంపెనీకి అప్పగించార‌ని పేర్కొన్నారు. ఆ తరువాత అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు.  టెండర్‌ వేసినప్పుడు వైయస్‌ఆర్‌ సీపీలో మెంబర్‌ కూడా కాదు. కేవలం ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా బిడ్డు వేశాను. ఆ బిడ్డు నాకు రాలేదు. ఫైబర్‌ గ్రిడ్‌ మదర్‌ ఆఫ్‌ స్కామ్స్‌ అని, ఆ తర్వాత అనేక టెండర్లు ఇదే రీతిలో కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టారు. టెండర్‌కు సంబంధించి వాస్తవాలు తెలిపేందుకు ప్రెస్‌మీట్‌ పెట్టానని చెప్పారు. 

  గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం అంతా పెద్ద స్కాం. అన్నీ అర్హతలు ఉన్నా, తన కంపెనీకి టెండర్ దక్కలేదు, దీనిపై అప్పట్లోనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  ఫైబర్ గ్రిడ్ టెండర్‌కు సంబంధించి వాస్తవాలు ప్రజల ముందు ఉంచడానికే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాను.
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఇవాళ ‘వాణిజ్య ఉత్సవ్-2021’ కార్యక్రమంలో రాష్ట్రంలో పారిశ్రామిక విధానం ఎంత బాగావుంది, ఎలా మెరుగుపడుతుందో కూడా వివరించారు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చి,  జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెచ్చి పారదర్శక పద్ధతితో ముందుకు వెళుతున్నారు. 2014-19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి కనిపించనేలేదు.  

  2015లో జరిగిన ఫైబర్ గ్రిడ్ టెండర్‌ ప్రక్రియలో వాస్తవాలను వివరిస్తున్నాను. టెండర్‌ విషయానికి వస్తే ఫైబర్‌ అప్టిక్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్‌ లో అమలు కోసం జీవో ఎంఎస్‌ నెం.10ను జారీ చేశారు. 
ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే టెండర్‌ను పూర్తి చేయాలని జీవోలో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
- ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అనేది ఒక స్టాండర్ట్‌, వెరీ సెక్యూర్‌ ఫ్లాట్‌ఫామ్‌ అంటారు. ఇందుకు సంబంధించి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని గైడ్‌లైన్స్‌ను కూడా ఇచ్చింది. పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. అర్హత ఉన్న ప్రతి కంపెనీకి అవకాశం ఇచ్చి... దాంట్లో ఎవరు తక్కువ రేటుకు బిడ్ వేస్తే, వారికి ఆ ప్రాజెక్ట్‌ ఇవ్వాలని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం జీవో నెం.16,20 ల ద్వారా కొన్ని మార్గదర్శకాలను అడాప్ట్‌ చేసుకుంటామని ఆ జీవో ద్వారా చెప్పడం జరిగింది.
-  జీవో నెం.10 ప్రకారం ఫైబర్‌ అప్టిక్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ టెండర్‌ను కూడా ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారానే చేయాలని నిర్ణయించింది. అలాంటి టెండర్‌ను రిలీజ్‌ చేసినప్పుడు అందులో ఉండే నిబంధనలు కూడా క్లాజ్‌ బై క్లాజ్‌ ఫాలో కావాలి. ఈ టెండర్‌ను 7.7.2015లో విడుదల చేశారు. జనరల్‌గా ఏదైనా టెండర్‌ వస్తే మూడు రకాలుగా కండీషన్లు పెడతారు. 
జనరల్‌ కండీషన్‌కు వస్తే....

    1. బిడ్డర్‌ వేసే వాళ్ళు ఒక కంపెనీ అయివుండాలి. (1956,2013 ప్రకారం కంపెనీ యాక్ట్‌ ప్రకారం ఇన్‌ కార్పొరేట్‌ అయి ఉండాలి) 2. టెండర్‌ వేసే కంపెనీ కనీసం మూడేళ్లు వ్యాపారంలో ఉండాలని నిబంధనలు పెట్టారు. ప్రతి నిబంధనకు ప్రూఫ్స్‌ ఉండాలి. 3. ఏ కంపెనీ కూడా బ్లాక్‌ లిస్ట్‌లో ఉండకూడదని నిబంధనలు చెబుతున్నాయి. 

  వాస్తవానికి, ఫైబర్‌ గ్రిడ్‌ కోసం టెండర్లు వేసిన నాలుగు కంపెనీల్లో మా కంపెనీ కూడా ఉంది. టెరాసాఫ్ట్‌ కంపెనీ, హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, హొరైజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ అనేవి మూడు కలిసి టెండర్‌ వేశాయి, అయితే హొరైజన్‌ అనేది కంపెనీ కాదు లిమిటెడ్‌ లైబులటీ పార్ట్‌నర్‌షిప్‌ కలిగింది. దీనికీ కంపెనీ యాక్ట్‌కు సంబంధం లేదు.

  ఫైనాన్షియల్‌ కండిషన్స్‌కు వస్తే... హొరైజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ అనేది 2014లో అంటే టెండర్‌ వేసే ఎనిమిది నెలల క్రితమే రిజిస్ట్రర్‌ చేసుకోవడం జరిగింది. ఈ రెండు కారణాలు వల్లే వాళ్లు వేసిన టెండర్లు రిజక్ట్‌ అవ్వాలి. ఫైనాన్షియల్‌ ఎలిజిబులిటీకి వస్తే ఈ కంపెనీలు రూ.350 కోట్లు టర్నోవర్‌  ఉండాలి. లీడ్‌ బిడ్డర్‌ రూ.100కోట్లు ఉండాలి, కన్సార్షియం కంపెనీలు రూ.50కోట్లు మినిమంగా ఉండాలని చెప్పడం జరిగింది. మరి వాళ్లు వేసిన బిడ్‌లో హొరైజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ అనేది కేవలం అయిదు కోట్లు కూడా టర్నోవర్‌ లేదు. దీనిమూలంగా కూడా వాళ్లు డిస్‌క్వాలిఫై కావాలి, కానీ కాలేదు.

 టెక్నికల్‌ కండిషన్స్‌కు వస్తే... హెడ్‌ అండ్‌ కేబుల్‌ టీవీగా, 200 ఛానల్స్‌తో పెట్టి ఉండాలి. అది కూడా ఇండియాలో పెట్టి ఉండాలి. అది కూడా 2005 తర్వాత పెట్టి ఉండాలనేది కండిషన్‌. ఈ మూడు కంపెనీలు కలిసి కన్షార్టియం రాసుకున్న అగ్రిమెంట్‌లో హొరైజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ తో కలిసి తాము చేస్తామని రాసుకున్నారు.
- వాస్తవానికి ఈ కంపెనీ ఇండియాలో ఏ ప్రాజెక్ట్‌ చేయలేదు. దుబాయ్‌లో ఏదో ప్రాజెక్ట్‌ చేసింది. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా పెట్టింది. వాళ్లు పెట్టిన మూడు కండిషన్లు (జనరల్‌, ఫైనాన్షియల్‌, టెక్నికల్‌) ఈ మూడింటిలో కూడా ఉల్లంఘించాయి.  ఇవన్నీ చూస్తే టెండర్‌ ఓపెన్‌ చేయగానే డిస్‌ క్వాలిఫై కావాలి. కానీ అలా జరగలేదు.

  టెండర్‌ నిబంధనల్లో పేర్కొన్న అంశాలు ఏటంటే... టెండర్‌ ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఎటువంటి కరస్పాండెంట్‌ చేయకూడదు. వీళ్లు చేసిన అవకతవకల విషయానికి వస్తే.. టెండర్‌లో ఒక్కో కంపెనీ కేవలం ఒక్క బిడ్‌ మాత్రమే వేయాలి. ఒకవేళ నిబంధన ఉల్లంఘిస్తే టెండర్‌ను రద్దు చేస్తామని ఉంటుంది. అయితే టెరాసాఫ్ట్‌ తో పాటు కలిసి ఈ కంపెనీలు రెండు ఫ్రైజ్‌ బిడ్స్‌ వేశారు. రూ.329 కోట్లు టెండర్‌ అయితే ఒక బిడ్‌లో  1.47 శాతం మైనస్‌ , రెండో బిడ్‌లో 2.47 శాతం మైనస్‌ వేయడం జరిగింది. ఇవన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇది కూడా నిబంధనల ఉల్లంఘనే. 

- ఏ టెండర్‌ వేసినప్పుడైనా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పెడతారు. కేవలం ఆ డాక్యుమెంట్‌లు ఆధారంగానే టెండర్లు ఫైనలైజ్‌ అవుతాయాని నిబంధనల్లో  రాశారు. అందులోనూ,  వాళ్లు పెట్టిన కండిషన్లు ద్వారా వాళ్లే డిస్‌క్వాలిఫై కావాలి. అలా కాకుండా హొరైజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ టెండర్‌ అనేది... 2015 జులై 31న ముగియాల్సి ఉంది. అయితే దాన్ని 7రోజులు ఎక్స్‌టెండ్‌ చేశారు. ఎక్స్‌టెండ్‌ చేసింది కూడా టెరాసాఫ్ట్‌ కంపెనీకి మేలు చేయడం కోసమే.
- కారణం ఏంటంటే  30వ తేదీవరకూ టెరాసాఫ్ట్‌ కంపెనీ బ్లాక్‌లిస్ట్‌లో ఉంది. ప్రభుత్వానికి చెందిన ఏపీటీఎస్‌ సంస్థ, టెండర్‌ వేసే రెండున్నర మాసాల ముందే ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. 11.05 2015లో ఈ కంపెనీని ఒక ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం జరిగింది. వీళ్లు దొడ్డిదారిన బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నదాన్ని ఎత్తివేసేందుకు, టెండర్‌ గడువు పొడిగించడంతో పాటు ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌ నుంచి ఎత్తివేస్తున్నట్లు  ఏపీటీఎస్‌ జీఎం ద్వారా ఒక లేఖ ఇచ్చారు. 
- బ్లాక్‌లిస్ట్‌ ఎత్తివేసే అంశంలో కూడా అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించారు. ఏ కంపెనీ అయిన బ్లాక్ లిస్టు  పిరియడ్‌ పూర్తి అయిన తర్వాత మాత్రమే టెండర్‌లో పాల్గొనవచ్చు, లేదా వాళ్లు  కోర్టుకు వెళ్లి, మినహాయింపు తెచ్చుకుని టెండర్‌లో పాల్గొనవచ్చు. అయితే వాళ్లు దొడ్డిదారిన వెళ్లి జీఎం లెవల్‌ అధికారి ద్వారా బ్లాక్‌లిస్ట్‌ను తొలగించుకోవడం జరిగింది. 
- వాస్తవానికి, ఎవరైతే ఒక కంపెనీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారో వాళ్లు మాత్రమే దాన్ని తొలగించగలరని నిబంధనల్లో చెప్పడం జరిగింది.
- టెరా సాఫ్ట్ ను..  ఏపీటీఎస్‌ ఎండీ బ్లాక్‌ లిస్ట్‌ చేస్తే... ఆయనకు మాత్రమే దాన్ని తొలగించే అధికారం ఉంటుంది. అయితే ఎండీ కాకుండా జీఎం స్థాయి అధికారి ద్వారా బ్లాక్‌లిస్ట్‌ జాబితా నుంచి తొలగించుకుని టెండర్‌లో పాల్గొనడం జరిగింది.
-బిడ్‌ గడవు ముగిసిన తర్వాత ఎవాల్యూయేషన్‌ కమిటీ డా​క్యుమెంట్‌ పరిశీలించి, కంపెనీలను టెక్నికల్ గా క్వాలిఫై చేస్తారు. క్వాలిఫై చేసిన కంపెనీలకు ఫలానా రోజున ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తామని సమాచారం ఇస్తారు. అదే విధంగా ఈ క్వాలిఫై అయిన బిడ్డర్ల డాక్యుమెంట్స్ అన్నీ పోర్టల్ లో అందుబాటులో ఉంచాలి. ఇక్కడ,  అలా జరగకుండా, క్వాలిఫై అయిన టెండర్ దారులకు సమాచారం ఇవ్వకుండా, ఏకంగా 12వ తేదీన ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి,  టెరాసాఫ్ట్‌ కంపెనీని ఎల్‌1గా ప్రకటించి, ఆ తర్వాత మాత్రమే డాక్యుమెంట్స్ ను పోర్టల్ లో పెట్టడం జరిగింది. ఇది టెండర్ ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా జరిగింది. పేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ను (మా కంపెనీని) ఎల్‌2గా డిక్లేర్‌ చేయడం జరిగింది. అర్హత లేని టెరాసాఫ్ట్ పై డిస్ క్వాలిఫికేషన్ చేసి ఉంటే.. పేస్ పవర్ సిస్టమ్స్ ఎల్  ప్రకటించ బడేది. ఈ విధంగా పేస్ కు దక్కాల్సిన ప్రాజెక్టును అడ్డదారిలో టెరాసాఫ్ట్ కు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. 

 అప్పుడు మాత్రమే టెరాసాఫ్ట్‌ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పెట్టారు, ఇది చూసిన తర్వాత 13వ తేదీన, నిబంధనల ప్రకారం టెండర్లు ఖరారు చేయలేదని ప్రభుత్వానికి మేం ఫిర్యాదు చేయడం జరిగింది. అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించి, దొడ్డిదారిన బ్లాక్ లిస్టు నుంచి బయటపడిన, టెండర్లలో డిస్‌క్యాలిఫై అవ్వాల్సిన సంస్థలని ఎల్‌1గా డిక్లేర్‌ చేయడం పూర్తిగా తప్పు అని చెప్పాం.

  అలానే టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎక్స్‌పీరియన్స్‌ కింద వాడుకున్న డాక్యుమెంట్‌ ను వెరిఫై చేస్తే..  అది కూడా మా కన్సార్టియం కంపెనీ చేసిన ప్రాజెక్ట్‌. కనీసం, మోడల్‌ నంబర్లు, సీరియల్‌ నంబర్లు కూడా మార్చకుండా సిగ్నం నుంచి ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ పెట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.

  ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ ను టెరాసాఫ్ట్‌కు ఇవ్వాలనేది ముందుగానే డిసైడ్‌ అయ్యి, తూతూమంత్రంగా టెండర్ల  ప్రక్రియ నడిపించారని అర్థం అయింది. టెండర్లకు సంబంధించి టెక్నికల్‌ కమిటీలో ఏపీటీఎస్‌ ఎండీ సుందర్‌ ఉండేవారు. ఆయన ఒక అఫిషియల్‌ లెటర్‌ కూడా రాశారు. ‘టెరాసాఫ్ట్‌ కంపెనీ మంచిది కాదు, అది బ్లాక్‌లిస్ట్‌ లో ఉంది. పనులు కూడా సరిగా చేయలేదు, అదే ఎల్‌2 కంపెనీకి అర్హతలు ఉన్నాయి. వాళ్ళను పిలిపించి నెగోషియేట్ చేసి ఎల్ 1 ప్రైస్ కు మ్యాచ్ చేసి, పేస్ కు కంపెనీకి ఇవ్వాలి’ అని చెప్పినా పట్టించుకోకుండా టెరాసాఫ్ట్‌కు టెండర్ అప్పగించడం జరిగింది.
-  ఏ టెండర్లు అయినా సరే డ్యూ డేట్‌ అయిన తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్‌నూ స్వీకరించరు. కేవలం ఆన్ లైన్ లో సబ్ మిట్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే పరిశీలించి బిడ్డర్లను క్వాలిఫై చేస్తారు. అలాకాకుండా, వీళ్ళు టెరాసాఫ్ట్ కు టెండర్ కట్టబెట్టేందుకు బిడ్ డ్యూ డేట్ తర్వాత కూడా డాక్యుమెంట్లు స్వీకరించడం అనేది సీవీసీ(సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) క్షమించరాని నేరం.  

 ఫైబర్ గ్రిడ్ తొలి దశ ప్రాజెక్టు రూ.329 కోట్లు, ఇది కాక .. సెట్ ఆఫ్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్- ఫేజ్ 2..  వీటికి సంబంధించి మూడు టెండర్లు, ఇదే సాంబశివరావు ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, వారికి అనుకూలమైన కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు మొదటి దశ టెండర్ లలోనే ఇంత స్కామ్‌ జరిగినప్పుడు,  మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాన్ని, వాస్తవాలను ప్రజలుకు చెప్పేందుకే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టడం జరిగింది.

 ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ, ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనుక ఉన్న "తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలను" కఠినంగా శిక్షించాలి. 
- ఆరోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లను, మాకు రానివ్వకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని,  బియాండ్‌ ద పాయింట్ వరకూ వెళ్లి ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలి. 

తాజా వీడియోలు

Back to Top