తాడేపల్లికి జిల్లా ఆసుపత్రినివ్వండి

-కొట్టు సత్యనారాయణ

 

తాడేపల్లి గూడెంలో ఏరియా ఆసుపత్రి 2001లో ఏర్పాటు చేసారు. దానికి భూమి కావాలంటే మూడేళ్ల వరకూ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మున్సిపాలిటీ కొన్న స్థలాన్ని ఆసుపత్రికి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడున్న హాస్పిటల్ పర్మిసెస్ ని మున్సిపాలిటీకి ట్రాన్స్‌ఫర్ చేసారు. 100 పడకల ఆసుపత్రిగా దాన్ని ఏర్పాటు చేసారు. నేను శాసన సభ్యుడిని అయ్యిన తర్వాత మరో 30 పడకలకు దాన్ని పెంచాము. ఎం.బీ.ఎస్.యు కింద మరో 10 పడకలు సాంక్షన్ అయ్యాయి. జిల్లాకు నడిబొడ్డున ఉండి, వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణం తాడేపల్లి గూడెం. నేషనల్ హైవే, రైల్వే లైన్లతో సౌకర్యవంతమైన పట్టణం. 40, 50వేల మంది వ్యాపర నిమిత్తం ప్రజలు తిరుగుతారు. 15 మండలాలకు పైగా ప్రజలు ఇక్కడ ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. అందుకే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం బావుంటుందనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. దానికోసం స్థలం ఇచ్చేందుకు కూడా సంసిద్ధత ఉంది. కానీ దాన్ని ఏలూరులో పెట్టారు. అక్కడున్న డిస్టిక్ ఆసుపత్రిని తరలించాల్సి వచ్చింది. ఇప్పుడున్న ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులు లేవు. పేషెంట్ల ప్రాణాలు గాల్లో ఉంటున్నాయి. కనుక జిల్లా ఆసుపత్రిని అక్కడకు ఏర్పాటు చేస్తే బావుంటుంది. ముఖ్యమంత్రి గారి ధ్యేయం 1000 దాటిన చికిత్సలు ప్రభుత్వం చేయిస్తుందని. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాకుండా జిల్లా ఆసుపత్రిని తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని మంత్రిగారిని కోరుతున్నాం.

తాజా ఫోటోలు

Back to Top