గౌతంరెడ్డి అకాల మరణం బాధాకరం

గౌతంరెడ్డి సంస్మరణ సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
 

నెల్లూరు: దివంగత నేత, అజాతశత్రువు మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన గౌతంరెడ్డి సంతాప సభకు శ్రీధర్‌రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం అందించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించి గౌతంరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించ లేదు. గౌతంరెడ్డి కంటే పెద్ద వయసు ఉన్న నేను గౌతంరెడ్డి సంతాప సభకు అధ్యక్షత వహించడం బాధాకరం. వైయస్‌ జగన్‌   ప్రియ మిత్రుడిగా, సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చి జిల్లాలోనే అతి తక్కువ కా లంలో మంచి పేరు తెచ్చుకొని మేకపాటి కుటుంబంలో ఉన్నత స్థానంలోకి వెళ్తారని, పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ భావించారు. దురదృష్టకరంగా గౌతంరెడ్డి అకాల మరణం పొందడం బాధాకరం. ఈ జిల్లాలో మంత్రిగా ఉండి మరణించిన వ్యక్తుల్లో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి తరువాత గౌతంరెడ్డి మాత్రమే. ఆ కుటుంబ పరిస్థితి  చూస్తే కడుపు తరుక్కుపోతోంది. మేకపాటి రాజామోహన్‌రెడ్డి, తల్లి మణివంజరికి ఈ వయసులో పుత్రశోకం చూస్తే కడుపు తరుక్కుపోతోంది. అతి చిన్న వయసులోనే భర్తను, తండ్రిని కోల్పోయినప్పుడు వారి పరిస్థితి  బాధాకరం. ఇలాంటి దుర్మార్గాలు ఆ దేవుడు ఎందుకు ఇలా చేశారో. గౌతంరెడ్డి అందరితో సఖ్యతగా ఉండేవారు. మాతో ఎంతో అన్యోన్యంగా మెలిగేవారు. అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణం అంటే బాధపడాల్సిందే. సీఎం వైయస్‌ జగన్‌ తన స్నేహితుడి పట్ల, రాజకీయ సహచరుల పట్ల ఎంతగా ఉంటారో తెలపడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. గౌతంరెడ్డి మరణవార్త వినగానే కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వెళ్లి నివాళులర్పించడమే కాకుండా, అంత్యక్రియల్లో పాల్గొని చితిమంటల సాక్షిగా కడసారి వీడ్కోలు పలికారు. ఈ రోజు సంతాప సభకు రావడం నిజంగా వైయస్‌ జగన్‌ లాంటి ఒక గొప్ప నేత నాయకత్వంలో ఓ ఎమ్మెల్యేగా పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. మేకపాటి గౌతంరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..ఆ కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లా ప్రజలు ఎప్పటికీ గౌతంరెడ్డిని మరచిపోరని, ఆ కుటుంబానికి మా శక్తి కొలది నైతికసై్థర్యం అందిస్తామని తెలిపారు. సంతాప సభను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏర్పాటు చేసి అన్నీ తానై వ్యవహరించడం గొప్ప విషయం. ఆ కుటుంబానికి కూడా వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top