సంక్షేమాన్ని కొత్తగా నిర్వచించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

ప్రజల సంక్షేమాన్ని చూసి ఓర్వలేక సంక్షోభం అని టీడీపీ దుష్ప్రచారం

కళ్లు ఉండి కూడా చూడలేని స్థితికి టీడీపీ దిగజారింది

ప్రతిపక్ష విషప్రచారంపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజం

అసెంబ్లీ: ‘గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం.. కానీ, సంక్షేమాన్ని కొత్తగా నిర్వచించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు’ అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ప్రజల సంతోషంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక సంక్షేమం.. సంక్షోభంలో ఉండాలని టీడీపీ కోరుకుంటుందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. 

‘‘గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామాలకు వెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందన వస్తుంది. ఏరకంగా ప్రతి కుటుంబానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం భరోసా ఇచ్చిందో.. ప్రజల గురించి ఏరకంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారో అర్థం అవుతుంది. పాలన గురించి ప్రజలు గ్రహించినంత కూడా ప్రతిపక్షం గ్రహించకపోవడం దుర్మార్గం. కళ్లు ఉండి కూడా చూడలేకపోతున్నారు. 

బాపట్ల నియోజకవర్గంలో గుడిపుడి అనే గ్రామంలో టీడీపీ అభిమానులు ఎక్కువ. ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రైల్వే క్రాసింగ్‌ దాటాలి. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక రైల్వే గేటు ఎక్కువగా పడుతుందని మాట్లాడుతున్నారు. ప్రతీ దానికి సీఎం వైయస్‌ జగన్‌పై నిందలు వేసే స్థితిలో టీడీపీ ఉంది. ప్రజల చేత చీత్కరించబడి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన పార్టీ టీడీపీ. ఆర్థికంగా, ఇండస్ట్రీపరంగా, లక్షల ఉద్యోగాలు, ఆర్బీకే, రైతు భరోసా, మహిళా సాధికారత కోసం ఆసరా నుంచి చేయూత వరకు ఇలా ఏరకంగా సాయం చేస్తున్నామో ప్రతీ అంశం మీద స్పష్టమైన విధానంతో వెళ్లడం ద్వారా మాత్రమే జీడీపీ సాధించాం’’  అని కోన రఘుపతి అన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top