దళిత ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ గూండాల దాడి

విజయవాడ: ఉద్యమం ముసుగులో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై రైతుల ముసుగులో ఉన్న టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. ఉదయం ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు విజయవాడ తోట్లవల్లూరు కరకట్ట వద్ద దళిత ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై దాడి చేశారు. తోట్లవల్లూరు కరకట్ట మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న టీడీపీ గూండాలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. టీడీపీ భయానక వాతావరణం సృష్టిస్తుందని, తనపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమారు చెప్పారు. దాడులకు పాల్పడుతుంది రైతులు కాదు.. టీడీపీ గూండాలేనని, చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారన్నారు.

Back to Top