చంద్రబాబు కుట్రలు..కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు  

ఎమ్మెల్యే కిలారి రోశయ్య
 

సచివాలయం: ప్రజలను మోసం చేసి ప్రపంచంలోనే అత్యంత ధనికుడు కావాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయనకు చివరి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నెల రోజులుగా రాజధాని పేరుతో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ రోజు శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టులను పక్కనపెట్టారు. చంద్రబాబు కు ఒక పేటెంట్‌ రైట్‌ ఉంది. ఎన్నిసార్లైనా అబద్ధాలు ఆడి దాన్ని నిజం చేసుకునే గుణం ఆయనది. చంద్రబాబు మాటల్లో విశ్వాసం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పన్నాగం పట్టి..ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇది అఖరు కాబోతుంది. ప్రజలను మోసం చేస్తే..నీకు అదే జరుగబోతుంది. చంద్రబాబు కుట్రలు బయటకు రాబోతున్నాయి. రైతుల ముసుగులో ధర్నా చేయిస్తున్నారు. రైతులకు మంచి చేసింది ఒక్క వైయస్‌ఆర్‌ కుటుంబం మాత్రమే. రైతులకు పెట్టుబడి సాయం చేశాం. మద్దతు ధర కల్పించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు రైతుల కళ్లలో ఏ రోజైనా ఆనందం చూశారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ అమలు చేసిన అమ్మ ఒడి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమాలు సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. అక్షరాస్యత లేకుంటే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమా? . ఏ రోజు అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావా? ఉన్నతమైన కుటుంబాల లబ్ధి కోసం అమరావతిలో చంద్రబాబు ధర్నాలు చేయిస్తున్నారు. శివరామకమిటీ రిపోర్ట్‌, శ్రీబాగ్‌ ఒప్పందాలను చంద్రబాబు తుంగలో తొక్కారు. ఆ కమిటీలపై ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకోబోతున్నారు. చంద్రబాబు వాస్తవాలు మాట్లాడాలి. గత నెల రోజుల నుంచి చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రతిపక్షం ఏ రోజైనా మాట్లాడిందా? చంద్రబాబు కుళ్లు బయటపడుతోంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top