పామర్రుకు మన దేవుడు వచ్చాడు

జగనన్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌

కృష్ణా జిల్లా: పామర్రుకు మన దేవుడు వచ్చాడు..ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చార‌ని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ భావోధ్వేగానికి గుర‌య్యారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మం శుక్ర‌వారం పామ‌ర్రులో నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అనిల్‌, విద్యార్ధులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే...వారి మాటల్లోనే

కైలే అనిల్‌కుమార్, పామర్రు ఎమ్మెల్యే

ఈ రోజు పామర్రుకు మన దేవుడు వచ్చాడు, చాలా సంతోషంగా ఉంది, నిత్యం ప్రజల్లో ఉండే మన సీఎంగారు ఎక్కడా కూడా కులం, మతం చూడలేదు, ఓటు వేశారా వేయలేదా అని కూడా చూడలేదు, జగనన్నా మా అందరి కోసం తోడేళ్ళన్నీ ఏకమైనా పచ్చ మీడియా విషప్రచారం చేసినా జగనన్న మన కోసం పోరాడుతున్నారు, విద్యా దీవెన కార్యక్రమానికి అన్న పామర్రు రావడం సంతోషకరం, అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావాలన్న సంకల్పం గొప్పది, మన జగనన్న వ్యవస్ధలో మార్పులు రావాలంటే విద్య ఉండాలని భావించి అన్ని బాధ్యతలు అన్న తీసుకున్నారు. జూన్, జులై నెల వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి ఆలోచిస్తారు కానీ జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మీరంతా ఆలోచించి మన, మన పిల్లల భవిష్యత్‌ బావుండాలంటే జగనన్న ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి, ముఠానాయకులను, ప్యాకేజ్‌ స్టార్‌లను మీరంతా తరిమికొట్టాలి, ఒక వ్యక్తి ఈ మధ్య తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొత్త కథలు చెబుతున్నాడు, చంద్రబాబు...రాష్ట్రానికి జగన్‌ గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటారు, మా నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించారు, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నాను, జగన్‌ గారు సామాన్యుడైన నన్ను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను చేశారు, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జగనన్నా మీ వెంటే నడుస్తాను...థ్యాంక్యూ.

మీలాంటి సీఎం ఉండ‌టం విద్యార్ధులకు వరం: పి. శ్రీ షణ్ముక సాయి ప్రియ, విద్యార్ధిని

అన్నా అనే పదానికి అర్ధం, అమ్మలోని అ, నాన్నలోని న్న కలిపితే నిజంగా మీరేనన్నా, అమ్మలా గోరుముద్ద పెడుతూ, నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న మీరు నిజమైన గొప్ప మనసున్న అన్న, అన్నా మాది మధ్య తరగతి కుటుంబం, నా ఇంటర్‌ తర్వాత నాన్నకు హార్ట్‌ ఆపరేషన్, నా చదువు ఎలా కొనసాగించాలా అనుకునే సమయంలో నాకు క్రిష్ణా యూనివర్శిటీలో బీటెక్‌ సీట్‌ వచ్చింది, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను చదువుకుంటున్నాను, అమ్మ ఖాతాలో నేరుగా డబ్బు పడుతుంది, నాన్న తను చదువుకునే రోజుల్లో స్కాలర్‌షిప్‌ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారన్నారు, నేను ఒక్క ఆఫీస్‌కు వెళ్ళకుండా వలంటీర్‌ అన్నయ్య మా ఇంటికి వచ్చి నాకు కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇచ్చారు, మీలాంటి విజన్‌ ఉన్న వ్యక్తి సీఎంగా ఉన్నంతవరకు మా విద్యార్ధులకు వరం, మీరు మా విద్యార్ధులకు అన్నీ ఇస్తున్నారు, మీ వల్ల మాలాంటి ఎంతోమంది చక్కగా చదువుకుంటున్నారు, ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మా కుటుంబం కూడా చాలా లబ్ధి పొందింది, మేం మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఎదిగామంటే మీరే కారణం అన్నా, థ్యాంక్యూ. 

మా యూత్‌కు జ‌గ‌న‌న్నే మార్గదర్శి: దిల్షాద్, విద్యార్ధిని

అన్నా మాది పేద కుటుంబం, మా నాన్న ప్రేవేట్‌ ఎంప్లాయ్, ఆయన జీతం మీదే మా కుటుంబం గడుస్తుంది, నేను ఎన్నో ఆర్ధిక ఇబ్బందులతో ఇంటర్‌ పూర్తి చేశాను, ఇప్పుడు నేను సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాను, మీ దీవెనలతో నేను చదవలేను అనుకున్న కాలేజ్‌లో ఇప్పుడు చదవగలుగుతున్నాను, మీ విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా లబ్ధి పొందాను, నేను మా కరిక్యులమ్‌ కోర్సులతో పాటు ఇతర కోర్‌ సబ్జెక్ట్‌లు కూడా నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్‌ సంపాదించాను, సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌కు నేను ఎలిజబుల్‌ అయ్యాను, నాకు దక్కిన గొప్ప సాయం ఇది, వరల్డ్‌ లో ఉన్న టాప్‌ యూనివర్శిటీలలో నేను ఎంఎస్‌ చేయాలనుకున్నాను, మీరు విదేశీ విద్యాదీవెన తీసుకొచ్చారు, నాడు యోగి వేమన అన్నట్లు మీరు యువతకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు, మాల్కం గ్లాడ్‌వెల్‌ అనే ఇంగ్లీష్‌ రైటర్‌ టెన్‌ థౌజండ్‌ అవర్స్‌ థియరీ రాశారు, మీరు కూడా టెన్‌థౌజండ్‌ అవర్స్‌ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు, నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్‌ ప్రొఫెషనల్‌ దిల్షాద్‌గా నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌ మీద నిలబడి మాట్లాడతానని నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మా యూత్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నారు, అన్నా థ్యాంక్యూ.

Back to Top