వైఎస్‌ కుటుంబానికి రుణపడి ఉంటాం..

– జలయజ్ఞం సభలో కాటసాని
 

నేలటూరు: జలయజ్ఞం పథకం ద్వారా కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించిన వైఎస్‌ జగన్‌కు బనగానపల్లి ప్రాంత ప్రజలు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే కాటసాని రావిరెడ్డి అన్నారు. నేలటూరులో జరిగిన జలయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో జలయజ్ఞం పనులకు రూ.312 కోట్లు కేటాయించినందుకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు కతజ్ఙతలు తెలిపారు. కుందూ నది నుంచి వేల క్యూసెక్కులు పక్క జిల్లాలకు వెళ్తున్నా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 11 సంవత్సరాల క్రితం జలదరాశి ప్రాజెక్టుకు పునాదిరాయి వేస్తే.. ఆయన తనయుడు జగన్‌ నిధులు కేటాయించారని చెప్పారు. దీనికి ఆ కుటుంబానికి రుణపడి ఉంటామన్నారు. జిల్లాను అన్నివిధాలా అభివద్ధి చేసేందుకు హైకోర్టు కూడా కేటాయించారని చెప్పారు. అవుకు రిజర్వాయర్‌ కాలువలకు స్పిల్‌ వేను నిర్మిస్తే రైతులకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో మైనింగ్‌ ప్రాంతం ఎక్కువగా ఉంది... దీని నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇక్కడే ఖర్చు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. వైఎస్సార్‌ హయాంలో ఫారెస్టు ప్రాంతంలో కూడా మైనింగ్‌ చేసుకునేవారని.. ఇప్పుడు వాటి లీజులను రద్దు చేయడంతో ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దష్టికి తీసుకొచ్చారు. స్థానికంగా పనులు లేకపోవడం వల్ల వలసలు పెరుగుతున్నాయన్నారు. వీటిని కట్టడి చేయలంటే మైనింగ్‌ లీజులను పునరుద్ధరిస్తే స్థానికంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 

 

Back to Top