జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి ఆశీర్వ‌దించండి

గడప గడపకు మన ప్రభుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల‌:  సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందాలంటే మ‌రోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దించాల‌ని పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి కోరారు.  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 27 వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, జగనన్న ప్రభుత్వాన్ని దీవించా లని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, స్థానిక వార్డ్ కార్పొరేటర్ పల్లె శారద, కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత్ రెడ్డి, సంగాల సుదర్శన్ రెడ్డి, కల్లూరు మండల జడ్పీటీసీ ఆల ప్రభాకర్ రెడ్డి, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివ శంకర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి,  యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top