వైయస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పడు 

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని విజ్ఞప్తి

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట ఇచ్చారంటే కచ్చితంగా చేస్తారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..గతంలో ఉన్న నాయకులను చూశాం. ఎన్నికల కోసమే ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టును అరకొరగా నిర్మించి వదిలేశారన్నారు. వైయస్‌ జగన్‌ ఒక్కటే చెప్పారు. ప్రజల ముందు ఏ మాట అయితే చెబుతామో..అది నెరవేర్చాలన్నారు. మనం అన్ని పనులు పూర్తి చేసిన తరువాతే ఎయిర్‌ పోర్టును ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించి, అవసరమైన నిధులు మంజూరు చేయించి త్వరితగతిన ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అందరి నాయకులకు.. మన నాయకుడికి ఉన్న తేడా ఇదే అన్నారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కోరుకునే నాయకుడు మన అందరి నాయకుడు వైయస్‌ జగన్‌. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఎయిర్‌ పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఓర్వకల్లుకు సంబంధించిన మల్లికార్జున రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేయించాలని సీఎంను కోరారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టలేదని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు.  ఎయిర్‌పోర్టుకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి కోరారు. 

 

తాజా ఫోటోలు

Back to Top