ప్రజా ఉపయోగ బిల్లులకు చిల్లు పెడుతున్నారు

టీడీపీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

 

అసెంబ్లీ: శాసనమండలిని అడ్డుపెట్టుకొని టీడీపీ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిందని, ప్రజలకు ఉపయోగపడే బిల్లులకు కూడా చిల్లులు పెడుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. శాసనమండలి ఉపయోగమా.. లేక నిరుపయోగమా.. అని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చంద్రబాబు ఎవరి మీద అలిగి సభకు రాకుండా ఉన్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానించామని చెప్పారు. మండలి రద్దుపై చర్చలు కూడా జరుగుతాయన్నారు. సభా పూర్వకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రధాన ప్రతిపక్షం సభకు వచ్చి వారి వైఖరిని తెలియజేయాలన్నారు. శాసనమండలి ఎంత ఉపయోగమో.. నిరుపయోగమో.. సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో శాసనమండలి వద్దు అని చంద్రబాబు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చెప్పి రద్దు చేశారని గుర్తుచేశారు. సభ అంటే చంద్రబాబుకు గౌరవం లేదని, ఇంగ్లిష్, ఎస్సీ, ఎస్టీ బిల్లులపై సభలో చర్చ జరుగుతుంటే రాకుండా టీడీఎల్పీ ఆఫీస్‌లో, మండలి గ్యాలరీలో కూర్చున్నాడని, ప్రజలకు ఉపయోగపడే బిల్లులకు కూడా చిల్లులు పెడుతున్నాడన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రి తాలూకా పార్టీని విడిచిపెట్టి సొంతంగా పార్టీ పెట్టి తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి అయిన దేశంలోనే ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top