29 మంది చనిపోతే ఆ శవాలు అప్పుడు కనపడలేదా ?

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  కాపు రామచంద్రారెడ్డి
 

అమ‌రావతి: చంద్రబాబు పబ్లిసిటీ నెత్తికెక్కి గోదావ‌రి పుష్క‌రాల్లో తొక్కిస‌లాటలో 29 మంది చనిపోతే ఆ శవాలు అప్పుడు టీడీపీ నేత‌ల‌కు కనపడలేదా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి ప్ర‌శ్నించారు. చనిపోయిన వ్యక్తులకు పార్టీలను, కులాన్ని అంటగట్టి టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయదుర్గానికి చెందిన వ్యక్తి మర్కెట్‌ యార్డ్‌లో విత్తనాలను తీసుకొని ఇంటికొచ్చి మళ్లీ బయటకెళ్లి చనిపోయారని తెలిపారు. అయితే సహజ మరణాన్ని కూడా విత్తన పంపిణీలో చనిపోయారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top