జగనన్న పాలనలో గ్రామాభివృద్ధికి పెద్ద పీట‌..

గ్రామ స‌చివాల‌యం, ఆర్‌బీకేల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
 

అనంత‌పురం:   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రామాభివృద్ధికి పాల‌న‌లో పెద్ద‌పీట వేశార‌ని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు  కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కణేకల్ మండలం కలేకుర్తి  గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భ‌వ‌నాల‌ను  ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.  గ్రామ సచివాలయం, గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా  అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలను తలుపు తట్టి అందించడం జరుగుతుందన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్‌ గారి లక్ష్యాలను నెరవేర్చే దిశలో రాయదుర్గం  నియోజకవర్గం లోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్, బిల్డింగులు త్వరగా పూర్తి చేయుటకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే అది సాధ్యమైంది అన్నారు.

Back to Top