ఆంధ్రా, ఒడిషా ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు

శ్రీ‌కాకుళం:  ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యలు పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరపడం చాలా సంతోషదాయకమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎమ్మెల్యే జోగులు ఆంధ్రా, ఒడిషా ఇద్దరు ముఖ్యమంత్రులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజాం నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కోటియా, జంఝావతి ,శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్ట్ సమస్య పై సానుకూల వాతావరణంలో చర్చించార‌ని ఆయ‌న తెలిపారు. వీరి హాయంలో సమస్యలుకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని ఒడిషా ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించడం, సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం అని కంబాల జోగులు అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top