చంద్రబాబువి సైకో ప్రేలాపనలు 

 ఎమ్మెల్యే కంబాల జోగులు 
 

విజ‌య‌న‌గ‌రం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబువి సైకో ప్రేలాప‌న‌ల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు విమ‌ర్శించారు. రాజాం  క్యాంప్ కార్యాలయంలో కంబాల జోగులు మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికలు ఓటమి తరువాత సైకోలా వ్యవహరిస్తుంది మీరే అని చంద్రబాబు తీరుపై  ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో రాజాం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు  తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు 40ఏళ్లు రాజకీయ ఇండస్ట్రీ, 14ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకునే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం పద్ధతేనా అని  సూటిగా ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు పరిపాలించింది మీరే కదా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీరు చెట్టు పథకం కింద ప్రజల సొమ్ము దోచుకున్న మీకు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురుంచి మాట్లాడే అర్హత మీకు ఏ మాత్రం లేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. గతంలో రాజాం కు రింగ్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మభ్య పెడితే మోసపోయేందుకు ఇక్కడ ఎవరో సిద్ధం లేరని అన్నారు. సమైక్యాంధ్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే, రాష్ట్ర ప్రజలకు మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. అలాగే మూడు రాజధానులు అడ్డుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నది మీరు కాదా అని చంద్రబాబుని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించాలని, లేకపోతే ప్రజలే మిమ్మల్ని చీదరిస్తారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇల్లు గ్రామాలుగా తయారవుతుంటే వాటిని కూడా విమర్శించడం సరికాదన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కంబాల హెచ్చరించారు.

 కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు పాటు వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ, రాజాం ఎంపీపీ ప్రతినిథి లావేటి రాజగోపాల్ నాయుడు, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బండి నరిసింహులు, వైస్ ఎంపీపీ టాంకాల అచ్చం నాయుడు, రాజాం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు, పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వాకముళ్ళు చిన్నారావు, వైస్ ఎంపీపీ ప్రతినిథి యాలాల వెంకటేష్, సర్పంచ్ గెడ్డాపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top