పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం 

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు 
 

శ్రీకాకుళం జిల్లా : పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జ‌రుపుకుంటున్నామ‌ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు.   ఆంధ్రప్రదేశ్ కు మద్రాసు రాష్ట్ర రాజధానిగా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే దీక్షతో పొట్టిశ్రీరాములు 40 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేయడంతో దాని ఫలితంగానే నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు అవతరణ దినోత్సవాలను జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని,ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వంగర మండల జెడ్పీటీసీ కరణం సుదర్శన్ రావు, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు,  వంగర జెడ్పీటీసీ ప్రతినిధి కరణం సుదర్శన్ రావు, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు, రాజాం వైస్ ఎంపీపీ ప్రతినిధి యాలాల వెంకటేష్, రాజాం వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వాకముల్లు చిన్నారావు, మరువాడ సర్పంచ్ ప్రతినిధి గాడి మధుసూదన్ రావు,యోగా గురు సత్యనారయణ గుప్త, శ్రీహరిపురం మాజీ సర్పంచ్ శిమ్మినాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూభ గోపాలం, గొర్లె అన్నదమ్ముల,ఆశపు సూర్యం,సర్పంచ్ ప్రతినిధి గెడ్డాపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top