విద్యార్థుల బంగారు భ‌విత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బాట‌లు

 "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాల్లో ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి 

నెల్లూరు:  విద్యార్ధుల బంగారు భ‌విత‌కు ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాట‌లు వేస్తున్నార‌ని ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" వారోత్సవాలలో భాగంగా నియోజకవర్గంలోని పిల్లలకు 50 వేల చాక్లెట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు.  సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నామ‌న్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top