ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలి

జ్యోతుల చంటిబాబు 
 

అసెంబ్లీ: జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోరారు. మంగళవారం ఆయన సభలో మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గంలో చాలా వెనుకబడిన ప్రాంతం. ఏలేరు రైట్‌మెంట్‌ కెనాల్‌ గురించి గతంలో కూడా  ప్రస్తావించాం. ఈ కాలువను తవ్వడం ద్వారా గ్రావిటీ ద్వారా సుమారు 15 వేల ఎకరాలు సాగు అయ్యేది. ఏలేరుకు సంబంధించి ఫేజ్‌-2 పనులు అధునీకరించక పోవడంతో  రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేను ఆనుకుని ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతానికి, తూర్పు గోదావరి జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అయిన కాకినాడకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో  మా నియోజకవర్గం ఉంటుంది. సెంట్రల్‌ పాయింట్‌ అయిన జగ్గంపేటకు ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.  

 

Back to Top