గ్రామ సచివాలయాలతో సమస్యలకు పరిష్కారం

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి  
 

అనంతపురం: ప్రజల వద్దకు పరిపాలన అనేది జగనన్న సరికొత్త ఆలోచన కారణంగా ఏర్పడిన గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు అన్ని సమస్యలు పరిష్కారమైపో తున్నాయని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంత‌పురం జిల్లా పుట్లూరు మండలం తక్కల్లపల్లి గ్రామ సచివాలయం వద్ద ‘మన ఎమ్మెల్యే మన గ్రామానికి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు నా వద్దకు వచ్చి పెద్ద పెద్ద సమస్యలేవీ చెప్పలేదు, ఏవో చిన్న చిన్న సమస్యలే చెప్పారు, వాటిని వెంటనే పరిష్కరించమని అధికారులకు చెప్పానని అన్నారు.

‘స్పందన’ కార్యక్రమంలో కూడా ఒకరు పెన్షను ఇక్కడే కావాలని అడిగారు. అలాగే ఒకరు రోడ్డు కావాలని అన్నారు. అది కూడా కలెక్టరు గారి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. నిజానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు సమస్యలు అక్కడే పరిష్కరామైపోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మా వరకు రాకుండానే ప్రజలు అక్కడికి వెళ్లి అర్జీలు పెట్టుకోవడంతో వాటికవే పరిష్కారమవుతున్నాయని, గ్రామ సచివాలయాల వ్యవస్థ సక్సెస్ అయిందని, ప్రజల వద్దకే పరిపాలన అంటే ఏమిటో జగనన్న చేసి చూపించారని, ప్రజాస్వామ్యానికి కరెక్టు నిర్వచనం చెప్పారని పేర్కొన్నారు. 

అందుకే జగనన్న పరిపాలనను అంతా ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందించడాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పరిశీలిస్తున్నాయి, సర్వేలు చేస్తున్నాయని తెలిపారు. జగనన్న ఆలోచన కారణంగా దేశంలోని ప్రజలందరికీ ఇంటి వద్దకే సరుకులు అందే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు.

ఒకప్పుడు సంక్షేమ పథకాల కోసం ప్రజలు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకి అందే సంక్షేమ పథకాలు అన్నా టైమ్ కి కరెక్టుగా పడిపోతున్నాయని, లబ్ధిదారులు తమ బ్యాంకు అకౌంట్ చూసుకుంటే చాలునని పేర్కొన్నారు. ఇది నిజంగా జగనన్న పరిపాలనకు నిదర్శనమని అన్నారు.

 ఎంపీపీ వైస్ ఎంపీపీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు, వైయ‌స్ఆర్‌సీపీ  మండల కన్వీనర్ వైయ‌స్ఆర్ సీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Back to Top