స్థానిక పోరులో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదు

టీడీపీ అభ్యర్థులు కూడా దొరకరు

సీఎం వైయస్‌ జగన్‌ పక్కన జనం ఉన్నారు

సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తాయి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

 

 

తాడేపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి కనీస నామరూపాలు లేకుండా రాష్ట్ర ప్రజలు తరిమితరిమి కొట్టిన సిగ్గుశరం లేకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి లేదని, అభ్యర్థులు కూడా దొరకరని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఒకవేళ దొరికినా డిపాజిట్లు కూడా గల్లంతైతాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని, సీఎం పక్కన జనం ఉన్నారన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘మొన్నటి వరకు ఎన్నికలు పెట్టండి అని మాట్లాడిన చంద్రబాబు.. నిన్న ఎన్నికల కమిషన్‌ ముందుకు వచ్చి పారిపోయారు. ఈసీ ముందుకు వచ్చి కరోనా వైరస్‌ వచ్చింది ఎన్నికలు వద్దు అని టీడీపీ మాట్లాడింది. కరోనా వైరస్‌ తెలుగుదేశం పార్టీ ప్రబుద్ధులకు వచ్చింది. ప్రజల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ నేతలను తరిమికొడతారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు అమ్మ ఒడి పథకం అందజేయాలనే ఆలోచన, రైతు భరోసా ఇవ్వాలని, ఆటో అన్నలకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా..? మత్స్యకారులకు అండగా నిలబడ్డాడా..? చేనేతలకు చేయూతనివ్వాలనే ఆలోచన వచ్చిందా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉండాలని బాబు మదిలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా..?

తొమ్మిది నెలల కాలంలో ఇవన్నీ సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో దిశపై అఘాయిత్యం జరిగితే.. ఏపీలో దిశ చట్టం చేసిన ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌. అక్కచెల్లెమ్మలు, చిన్నారుల కోసం ఒక చట్టం  తీసుకువచ్చారు. దిశ చట్టాన్ని ఢిల్లీ, ఒడిశా, బిహార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం మేము కూడా దిశ చట్టాన్ని అమలు చేస్తామని దిశ ప్రతులను తీసుకెళ్తున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు తీసుకువస్తే.. మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు లేదు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరు. ఒకవేళ నిలబెట్టినా డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి. వైయస్‌ జగన్‌ పక్కన జనం ఉన్నారు. నవరత్నాలను ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. 90 శాతం ప్రజలు పాలనపై సంతృప్తిగా ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top