టీడీపీ..తెలుగు తాలిబన్ పార్టీగా మారింది

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే  జోగి రమేష్  

ద‌ళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అన్న బాబుపై ఏ కేసు పెట్టాలి, ఏ శిక్ష వేయాలి..? 

రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది.. డా. అంబేడ్కర్ ను దేవుడితో సమానంగా పూజిస్తాం 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చూస్తుంటే.. టీడీపీ అంటే తెలుగు తాలిబన్‌ పార్టీగా మారిందనిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే  జోగి రమేష్ పేర్కొన్నారు. "దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా, దళితులుగా జీవించాలని ఎవరైనా కోరుకుంటారా, దళితవాడల్లో  జీవించాలని ఎవరైనా అనుకుంటారా" అని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడినందుకు ఆయనపై ఏ కేసు పెట్టాలి, ఏ శిక్ష వేయాలని నిల‌దీశారు. ఆయనకు ఉరిశిక్ష వేయాలా..?  అలానే, బీసీ వర్గాలకు చెందిన "విశ్వబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని, శ్రీకాకుళం జిల్లాలో అగ్నికుల క్షత్రియుల్ని తరిమి తరిమి కొడతామని" చంద్రబాబు మాట్లాడారు, ఇటువంటి మాటలు మాట్లాడినందుకు చంద్రబాబును ఏ విధంగా శిక్షించాలి... అంటూ చంద్రబాబు గతంలో ఎస్సీలు, బీసీలపై చేసిన కామెంట్స్ ను మీడియాకు విడుదల చేశారు.  

 రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, గౌరవం నాకు ఉంది. రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గారిని ఎప్పుడూ కూడా దేవుడితో సమానంగా పూజిస్తాం.

రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మేమంతా అన్నదమ్ములం. అంతా ఒక కుటుంబం. మా కుటుంబాన్ని విభజించడం కోసమే, విచ్చిన్నం చేయడం కోసమో తెలుగు తాలిబన్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోంది. అలాంటిది నేను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ.. నా మీద కేసు పెట్టాలని చెప్పిన నారా చంద్రబాబుపై ముందుగా కేసు పెట్టాలి. చంద్రబాబు గారు ఏమన్నారు? నేను ఏమన్నాను?

 నా మాటలను వక్రీకరించి, బలహీన వర్గాలమైన మేము అంబేడ్కర్‌ గారిని దేవుడిగా పూజిస్తున్న ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఒక అడుగు ముందుకు వేసి జనరల్‌ స్థానాల్లో కూడా, అంటే రిజర్వేషన్లు లేని స్థానాల్లో కూడా జిల్లా పరిషత్‌, మేయర్లు, చైర్మన్‌ పదవుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూర్చోపెడుతున్నారు. అంతేకాకుండా నామినేటెడ్‌ పదవుల్లోను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేశారు. 56 కార్పొరేషన్లను బీసీ కులాలకు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్లు, నామినేటెడ్ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల్లో 58 శాతం మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన మాకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు స్థానం కల్పించి, ఈ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేస్తున్నారు. 

 బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారు ఒక్క అడుగు కాదు... నాలుగు అడుగులు ముందుకు వేస్తుంటే, దాన్ని నేను చెబుతుంటే... చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు చిలువలు, పలువలు చేసి మాట్లాడుతున్నారు. 

  చంద్రబాబు నాయుడుగారు మా వర్గాలను విభజించి పాలించాలని, చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే మీ పార్టీ నాశనం అయిపోయింది. ఇంకా విషపు కుట్రలతో చంద్రబాబు విషపురుగులాగా మారిపోయారు. చంద్రబాబులా నేను ఎప్పుడూ తప్పు మాట్లాడలేదు,  ఏం మాట్లాడానని నామీద నిందలు వేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేస్తారు..?

 ప్రతి సంక్షేమ పథకంలోనూ బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ, బలహీనవర్గాలను బలమైన వర్గాలుగా తీర్చిదిద్ది, సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ఒక సముచిత స్థానం ఇచ్చి, కొత్త చట్టాలను తెస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మాకు బలాన్నిఇస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిగారిపై కొంతమంది తాబేదార్లను పెట్టుకుని ప్రతిరోజు మీడియాను అడ్డం పెట్టుకుని విషం కక్కుతున్నారు.

 లక్ష కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా చేరేలా చేస్తుంటే దాన్నికూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తుంటే దాన్ని కూడా ఓర్చుకోలేక కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తాలిబన్‌లను ప్రజలు తరిమితరిమి కొట్టే రోజు వస్తుంది. 
 2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైయస్సార్‌ సీపీకి ప్రజలు పట్టం కడుతూ.. టీడీపీని ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు. అయినా చంద్రబాబుకు సిగ్గురాదు. ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఎప్పటికీ ప్రజలు నమ్మరు. బలహీన వర్గాలకోసం కొత్త కొత్త చట్టాలు చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి బీసీలు ఎప్పుడూ జేజేలు పలుకుతామ‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top