బాబు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు నమ్మరు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌

పార్టీ బతికే ఉందని చెప్పుకోవడానికి బాబు తాపత్రయం

ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు

తాడేపల్లి: చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మరని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు మభ్యపెడుతున్నారని, గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని, మళ్లి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారని ప్రశ్నించారు. రెండేళ్లలో చంద్రబాబు రాజకీయాల నుంచి పారిపోతారని వ్యాఖ్యానించారు. సీఎం వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఏమన్నారంటే..
ఇటీవల టీడీపీ నాయకులకు మాటలు ఎక్కువగా వస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండేళ్లలో రాజకీయాలు వదిలి ఏపీ నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐ టీడీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. టీడీపీ బతికే ఉందని..పార్టీ శ్రేణులను ప్రేరేపించే విధంగా రెచ్చగొడుతున్నారు.

గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా ఎలా దోచుకుతిన్నారో..మళ్లీ అదే విధంగా దోచుకుతినేందుకు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారట. టీడీపీ హయాంలో పందికొక్కుల మాదిరిగా దోచుకుతిన్నారు. రేపు మళ్లి అధికారంలోకి వస్తే ఐ టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తారట. ప్రభుత్వ పథకాలను స్కాములు ఎలా చేయాలో ఆలోచించే విధంగా చంద్రబాబు వారిని ప్రేరేపిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని వేశాలు వేసినా, తలక్రిందలుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా..లెంపలేసుకొని ఊరువాడ గ్రామగ్రామం తిరిగినా కూడా ఆయన్ను ఏపీ ప్రజలు నమ్మరంటే నమ్మరు. 

చంద్రబాబు నరరూప రాక్షసుడు అని ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలుసు. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే నాయకుడు చంద్రబాబు, ఏ విధంగానైనా సరే ప్రజలను మభ్యపెట్టే నాయకుడు ఆయన. ప్రజలను వంచించేందుకు ఎందాకైనా చంద్రబాబు ఎగబడుతారు. అందుకే ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు. 

చచ్చిపోయిన టీడీపీని బతికించుకునేందుకు కొన్ని పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకొని ఈ రోజు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారు. బూతు పురాణం  వల్లిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఏం చేశారని మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు. గతంలో ఐదేళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎంత దుర్మార్గంగా చూశారు. ఇదే సామాజిక వర్గాలకు మా ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తోంది. వైయస్‌ జగన్‌ మాటిస్తే తప్పరని ప్రజలు విశ్వసిస్తున్నారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. 

అచ్చెన్నాయుడికి బుద్ది ఉందా? సిగ్గు లేదా? అయ్యన్నపాత్రుడు పొద్దున లేచింది మొదలు తాగి ఊగుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, ప్రభుత్వంపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top