బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ఏకైక సీఎం వైయ‌స్‌ జగన్ 

వైయస్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే  జోగి రమేష్   

 బీసీలకు చంద్రబాబు టోపీ పెడితే.. బీసీలను తలెత్తుకునేలా చేసిన నాయకుడు వైయ‌స్‌ జగన్ 

 నేతన్నలకు చంద్రబాబు ఏడాదికి రూ. 50 వేలు కాదు.. 50 నయా పైసలు కూడా వేయలేదు 

 నేత నేసే ప్రతి కుటుంబానికి ఏటా రూ. 24 వేలు ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ 

 ఏపీలో బలహీనవర్గాలను బలమైన వర్గంగా మారుస్తున్న నాయకులు వైయ‌స్‌ జగన్

 26 నెలల వైయ‌స్ జగన్ పరిపాలనలో సీఎం టు కామన్ మ్యాన్  సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. అందులో బీసీల సంక్షేమానికి ఖర్చు చేసింది రూ. 50 వేల కోట్ల పైమాటే 

 రామోజీ, అమర్ రాజా వారు వియ్యంకులు కాబట్టే, ఈనాడుకు ఆ కాలుష్యం కనిపించటం లేదు 

  బాబు హయాంలో ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని పీసీబీ(కాలుష్య నియంత్రణ మండలి)లో వేసినా, ఏనాడూ ఈనాడుకి కనిపించలేదు. 

 ఎందుకంటే.. బాబు హయాంలో ప్రభుత్వం బంధువులది... పొల్యూషన్ వియ్యంకుడిది 

  కేంద్ర  ప్రభుత్వ అప్పులు జీడీపీలో 60 శాతానికి చేరిన విషయం వాస్తవం అవునా.. కాదా..? 

తాడేప‌ల్లి:  బీసీల అభ్యున్నతికి ఏపీలో సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. 14 ఏళ్ళపాటు అధికారంలో ఉండి, బీసీల నెత్తిన చంద్రబాబు టోపీ పెడితే.. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన 26 నెలల కాలంలోనే సీఎం టు కామన్ మ్యాన్ కు డీబీటీ(డైరెక్టు బెనిఫిట్ స్కీం) ద్వారా నేరుగా లబ్ధిదారులకు చేరేలా రూ. లక్ష కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే.. అందులో రూ. 50 వేల కోట్లకు పైగా బీసీల సంక్షేమానికి ఖర్చు చేశారని  తెలిపారు. అలానే, నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 19 వేల కోట్లకు పైగా బీసీలకు ప్రయోజనాలు లభించాయని చెప్పారు. ఏరోజైనా చంద్రబాబు ప్రభుత్వంలో డీబీటీ ద్వారా బీసీలకు ఒక్క రూపాయి వచ్చిందా..?, ఒక్క అంగుళం భూమి అయినా ఇళ్ళ పట్టాగా ఏనాడు అయినా ఇచ్చాడా? అని జోగి రమేష్  నిలదీశారు. 

తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది చేనేతలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఏడాదికి రూ. 24 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే..  నేతన్నలకు చంద్రబాబు ఏడాదికి రూ. 50 వేలు ఇచ్చాడని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, రూ. 50 వేలు కాదు కదా.. 50 నయా పైసలు కూడా ఏనాడూ చంద్రబాబు ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో  బీసీల అభ్యున్నతికి సరికొత్త రాజ్యాంగం రాస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అని అన్నారు. 

 ఎన్నికల ముందు పాదయాత్రలో చేనేత, నేత కుటుంబాలు పడుతున్న కష్టాలను అతి దగ్గరగా చూసి, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఏ మాట అయితే చెప్పారో, చెప్పిన మాట చెప్పినట్లు అధికారంలోకి వచ్చాక చేసి చూపించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు. నేతన్నల కుటుంబాలకు  రూ.24 వేలు చొప్పున మూడో ఏడాది వారి బ్యాంకు ఖాతాల్లో వేసిన సందర్బంగా జగన్‌ అన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల గురించి మాట్లాడుతుంటే.. ఆశ్చర్యం వేసింది. టీడీపీ హయాంలో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని, ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు ప్రతి ఏటా ఇచ్చామని వారు చెప్పారు. నేను నేతన్నలనే అడుగుతున్నాను. ఈరోజు అమ్మ ఒడి లభిస్తున్న నేతన్నలను, ఈరోజు ఆసరా ద్వారా డబ్బు అందుకున్న నేత కుటుంబాల అక్క చెల్లెమ్మల్ని, ఈరోజు చేయూత ద్వారా లబ్ధి పొందిన నేత కుటుంబాల అక్కచెల్లెమ్మల్ని, ఈరోజు నేతన్న నేస్తం ద్వారా రూ. 24 వేలు గత రెండేళ్ళుగా ప్లస్ ఈఏడాది అందుకున్న నేతన్నల కుటుంబాల్ని, వీటితోపాటు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ ద్వారా లబ్ధి పొందిన నేతన్నలు, అక్కచెల్లెమ్మెల కుటుంబాలను అడుగుతున్నాను. 
- ఏరోజైనా చంద్రబాబు ప్రభుత్వంలో డీబీటీ ద్వారా మీకు ఒక్క రూపాయి వచ్చిందా..?
- అంతేగాకుండా ఒక్క అంగుళం భూమి అయినా ఇళ్ళ పట్టాగా చంద్రబాబు ఇచ్చాడా?
- ఈ ప్రశ్నలకు నేతన్నలే సమాధానం చెబుతారు. 

 రాష్ట్రంలో బలహీనవర్గాలను బలవంతులుగా చేస్తూ,  వాళ్లు తలెత్తుకుని తిరిగేలా జగన్‌గారు చేశారు. ఇక మొత్తంగా బీసీల సంక్షేమానికి గత 26 నెలల పరిపాలనలో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 50 వేల కోట్లకు పైగా బీసీలకు అందింది. నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 19 వేల కోట్లకు పైగా బీసీలకు ప్రయోజనాలు లభించాయి. 
- కేబినెట్‌లో 60శాతంపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు స్థానం కల్పించడమే కాకుండా, రాజ్యసభ స్థానాలలో నాలుగు స్థానాలు వస్తే.. వాటిలో రెండింటిని బీసీలకు ఇచ్చింది ఒక్క జగన్‌గారే. ఏనాడైనా బీసీలకు చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చాడా..?

 చంద్రబాబు తన పాలనలో బీసీలకు పనికిరాని కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి, ఆ వర్గాలు ఎప్పటికీ అక్కడే ఉండాలి, వారు ఉన్నత స్థానాలకు ఎదగకూడదని బీసీలను అడుగడుగునా అణగదొక్కాడు. అదే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు బలహీన వర్గాల రాజ్యాంగ సృష్టికర్తగా..  బీసీ వర్గాల అభ్యున్నతి కోసం, అన్నింట్లో బీసీలకు సమానమైన వాటా ఇస్తూ, వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారు. బీసీల సంక్షేమం విషయంలో.. జగన్‌గారికి,  నారా చంద్రబాబుకు ఉన్న తేడాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 
-దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డిగారు, బలహీన వర్గాల  పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ద్వారా ఉన్నత విద్య అందించి ఉద్యోగస్తులను చేశారు. ఆయన తనయుడు జగన్ గారు మరో ముందడుగు వేసి బీసీ వర్గాల పిల్లలను ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా చూడాలనుకుంటున్నారు.
-చంద్రబాబు ఈకలు, తోకలు.. అంటూ మీడియా ముందుకు వచ్చి రంకెలేసే టీడీపీ బీసీ నేతలను రానున్న రోజుల్లో ప్రజలు గ్రామాల్లోకి కూడా అడుగు పెట్టనివ్వరు. దయచేసి చంద్రబాబు తొత్తులుగా మారవద్దు అని టీడీపీలోని బీసీ నేతలకు హితవు చెబుతున్నాను. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు అంతా జగన్‌ అన్న వెంట నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. 

 రామోజీరావు గారూ.. మీ వియ్యంకుడు(అమర్ రాజా వారు) విషాన్ని గ్రామాల నీటిలో కలిపినా సబబేనా..? 

 తన మనిషి అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఎల్లో మీడియాకు నిద్ర పట్టడం లేదు. ఈరోజు ఈనాడు పేపర్ లో *వారు నిపుణులేనట..* అని ఒక వార్త ప్రచురించారు. 
- కాలుష్య నియంత్రణ మండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చోటు ఇచ్చారని రాశారు. 
- ఇటువంటి వార్తలు రాయటానికి సిగ్గు ఉండాలి.
- అమర్ రాజా పరిశ్రమ అత్యంత భయంకరంగా కాలుష్యం వదులుతోందని, కార్మికులు బతికే పరిస్థితిలో లేరని, వారి రక్తంలో విషం కలిసిపోయిందని, అక్కడ చుట్టు ప్రక్కల ప్రాంతాల నీటిలో కూడా విషం కలిసిపోయిందని, అంటే మనుషులు, జంతువులు కూడా విషాన్ని తాగుతున్నారని స్పష్టంగా హైకోర్టు తీర్పు ద్వారా బయటకు వస్తే.. అటువంటి కాలుష్యకారక పరిశ్రమపై చర్య తీసుకునేందుకు వీల్లేదని ఈనాడు ఎందుకు రాస్తుందో తెలుసా..?
- ఎందుకు రాస్తుందంటే.. *ఈనాడు వారు, అమర్ రాజా వారు వియ్యంకులు కాబట్టి.
- రామోజీరావు గారూ.. మీ వియ్యంకుడు విషాన్ని చుట్టుప్రక్కల గ్రామాల నీటిలో కలిపినా సబబేనా..?
- వార్తలను ప్రజలకు తెలియచెప్పడం అంటే అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పడమా? మీకు కొన్ని టీవీలు, పత్రికలు ఉన్నంతమాత్రాన లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కల్పించి చెప్పడమా?
- ఎన్నికల ముందు కూడా ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టి, చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఎలా  చుక్కలు చూపించారో చూశాం.
- 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించే ఒక మహా యజ్ఞాన్ని ముఖ్యమంత్రిగారు నెరవేర్చబోతుంటే... పనులు సాగకుండా ప్రభుత్వానికి చంద్రబాబు గారు, రామోజీరావుగారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మరోపక్క టీవీ5... రాక్షసులు, శిఖండిలాగా అడ్డుపడుతున్నారు.

 చంద్రబాబు హయాంలో ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని పీసీబీలో వేసినా, ఏనాడూ ఈనాడు వారికి కనిపించలేదు. 

 ఈనాడులో ఈరోజు ప్రచురించిన వార్తలో కనీసం పీసీబీకి(కాలుష్య నియంత్రణ మండలికి)గత మీ ప్రభుత్వంలో, మీ బంధువుల ప్రభుత్వంలో ఎవరిని సభ్యులుగా నియమించారో ఒక్కసారి చూడండి. 
- కాలుష్య నియంత్రణ మండలిలో ఇప్పుడు మేం నియమించిన ముగ్గురిలో ఒకరు వ్యవసాయ రంగం నుంచి, మరొకరు యురేనియం వ్యతిరేక పోరాటం నుంచి, ఇంకొకరు వైద్య రంగం నుంచి నిపుణులు. 
- కానీ, చంద్రబాబు హయాంలో ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని పీసీబీలో వేసినా, ఏనాడూ ఈనాడు వారికి కనిపించలేదు. 
-ఎందుకంటే, *ప్రభుత్వం బంధువులది. పొల్యూషన్ వియ్యంకుడిది.*

 మరో విషయం ఏంటంటే.. రాష్ట్ర  ప్రభుత్వం బ్యాంకు రుణాలు తీసుకుంటుంటే ఎక్కడా లేని రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డెవలప్ మెంటు కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుంటుంటే.. ఆ లోన్లు పూర్తిగా ప్రజలకు మేలు చేస్తాయని తెలిసినా, వాటిని ఆపేందుకు చంద్రబాబు బంధువైన రామోజీరావు తన అడ్వకేట్ తోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పులు చేయరాదని పిటిషన్ వేయించిన విషయం వాస్తవం కాదా..?
- నళినీ కుమార్ అనే వ్యక్తి రామోజీకి అడ్వకేట్ అవునా.. కాదా..?

 కేంద్ర  ప్రభుత్వ అప్పులు జీడీపీలో 60 శాతానికి చేరిన విషయం వాస్తవం అవునా.. కాదా..? 

 అప్పులు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేస్తుందా.. కేంద్రం చేస్తున్నది ఈ ఎల్లో మీడియాకు కనిపించదా..?
- కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జీడీపీలో 11 శాతం మేరకు అప్పులు చేసిన మాట వాస్తవం అవునా.. కాదా..?
- మొత్తంగా కేంద్ర  ప్రభుత్వ అప్పులు జీడీపీలో 60 శాతానికి చేరిన విషయం వాస్తవం అవునా.. కాదా..?
- మన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఈ కోవిడ్ సమయంలో ప్రజలకు ఉపయోగపడుతూ, ప్రజల సంక్షేమానికి మాత్రమే వెచ్చిస్తున్న విషయం వాస్తవం అవునా.. కాదా..?

 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పసుపు-కుంకుమ అనే పేరు మీద సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డబ్బులనుగానీ, డ్రింకింగ్ వాటర్ స్కీము డబ్బులను గానీ, రోడ్ డెవలప్ మెంటు కోసం ఉన్న నిధులనుగానీ ఉపయోగించుకున్న విషయం నిజం అవునా.. కాదా..?

 కానీ, ఈరోజు ప్రభుత్వం ఇంతటి కోవిడ్ సమయంలో పేదలను రక్షించే పథకాలకు, అదికూడా డీబీటీ పద్ధతిలో, అవినీతికి ఆస్కారం లేకుండా ముందడుగు వేస్తున్న విషయం నిజం అవునా.. కాదా..?

 ఈరోజు ప్రభుత్వం డీజిల్, పెట్రోలుపై పెంచిన కేవలం ఒక్క రూపాయి భారంతో, మళ్ళీ రోడ్ల బాగు మీదే ఆ డబ్బును వ్యయం చేయబోతున్న విషయం వాస్తవం. దీనికీ పెడార్థాలు తీస్తారా, తప్పుడు కథనాలు వండి వారుస్తారా..?
- కానీ, నా వాడే ఉండాలి, నా మనిషే ఉండాలి, మా బాబే ఉండాలి.. అన్న పద్ధతిలో సాగుతున్న ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి మిగతా ఎల్లో మీడియాకు ఇప్పటికైనా మంచి బుద్ధి వస్తుందని ఆశించటం కూడా వృథా అన్నది రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమవుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top