ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌

చంద్రబాబును ఎందుకు విచారణ చేయడం లేదు

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు బాబు అమరావతికి పరారు

ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మళ్లీ హైదరాబాద్‌లో మకాం

రెండేళ్లుగా ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై కుట్రలు చేస్తున్న ప్రతిపక్ష నేత

జూమ్‌ మీటింగ్‌లతో అసత్యాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు

తాడేపల్లి:  ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్త, క్రియ చంద్రబాబేనని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టడం వల్ల ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు.

తెలుగు ప్రజలకు పట్టిన పీడ చంద్రబాబు. ఈ రోజు ఓటుకు కోట్లు కేసులో ఈడీ ఛార్జ్‌షిట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్‌రెడ్డి అన్నారు.2015 మే 31న స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని తెలిపారు. ఈ సమయంలో చంద్రబాబు ‘‘మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’’ అంటూ ఫోన్‌లో మాట్లాడారు. చంద్రబాబు పాత్రను ఛార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించిందన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అవి చంద్రబాబు మాటలేనని ఫోరెన్సిక్‌ రిపోర్టు ధ్రువీకరించిందన్నారు. ఈ కేసులో ఈడీకి జెరుసలేం మత్తయ్య పూర్తి వాంగ్మూలం కూడా ఇచ్చారన్నారు. చంద్రబాబు సూచనలతోనే తాను రాయభారం చేశానని ఈడీకి మత్తయ్య వాంగ్మూలం ఇచ్చినా కూడా చంద్రబాబును విచారణ చేయకపోవడం సరికాదన్నారు. 

 హైదరాబాద్‌లో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి..అర్ధరాత్రి కట్టుబట్టలతో విజయవాడకు పరారు అయి వచ్చాడు. ఓటుకు కోట్లు కేసులో ఆ రోజు చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెడతారని దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు. ఇవాళ కట్టుకథలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఇంద్రభవనాన్ని కట్టించుకున్నాడు. అమరావతిలో గ్రాఫిక్స్‌తో సినిమా సెట్టింగ్స్, మాజిక్స్‌ చేశారు. 2019లో ఘోరంగా ఓడిపోయిన తరువాత మళ్లీ హైదరాబాద్‌కు మకాం మార్చారు. 

 ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై నిత్యం కుట్రలు, కుతంత్రాలు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడతారు. రథాలను, విగ్రహాలను వదలకుండా కుట్రలు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్లుగా బ్రహ్మండగా పరిపాలన చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కష్టాలు ఉన్నా ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తు తోడుగా ఉంటున్నారు.

చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అడ్డం పెట్టుకొని కుట్రలు చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు, ఆయన తాబేదారులు, ఆయన అనుంగ శిష్యుడు ఓటుకు కోట్లు కేసులో ఈడీ కేసు బుక్‌ చేసింది.  ఇవాళ ఉదయం నుంచి జూమ్‌మీటింగ్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు. ఐపీసీ, సీఆర్‌పీసీపై దేశ ప్రజలకు నమ్మకం కలగాలి.

వ్యవస్థలను చంద్రబాబు బ్రహ్మండంగా వాడుకుంటున్నారు. ఆయన్ను విచారణకు కూడా పిలువలేదు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా  దొరికిపోయారు. బ్రిప్డ్‌డ్‌ మీ అన్న చంద్రబాబుపై కేసులు లేవు. ఇలాంటి పరిస్థితిలో వ్యవస్థలపై ఏవిధమైన నమ్మకం కలుగుతుంది.

ఐక్య రాజ్య సమితిలో ఏవిధంగా అయితే జెండాలు పెట్టుకుంటారో..ఆవిధంగా జెండాలు పెట్టుకొని మహానాడు అంటూ జూమ్‌లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు. జూమ్‌ మీటింగ్‌ల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్‌ మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును విచారించి శిక్ష విధించాలని జోగి రమేష్‌ ఈడీని కోరారు.
 

Back to Top