సామాజిక న్యాయాన్ని అమ‌లు చేసిన ఏకైక సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌
 

అమ‌రావ‌తి: 74 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తూ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ మాట్లాడారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్భంలో టీడీపీ ప్రవర్తించిన తీరును ర‌మేష్‌ ఖండించారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, వైయస్‌ జగన్‌ సమసమాజానికి ప్రతినిధిగా ఉన్నార‌ని, స‌మ స‌మాజ నిర్మాత‌గా ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు ప‌ద‌వుల్లో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న గొప్ప నేత వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఎన్నిక‌ల్లో 151 సీట్లతో గెలుపొందిన పార్టీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది  ప్రజల విశ్వాసం పొందిన ప్రభుత్వం. ఇలాంటి ప్ర‌భుత్వంపై దాడి చేస్తూ మీడియాల్లో డిబెట్లు పెడుతున్నారు. ఫెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకొని వైయస్‌ జగన్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు. అండమాన్‌లో టీడీపీ రెండు వార్డుల్లో గెలిచిందంట. రెండేళ్లలో టీడీపీ ఈ రాష్ట్రం నుంచి పారిపోతోందని ఎద్దేవా చేశారు.  
క‌రోనా క‌ష్ట‌కాలంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్ర‌తి నిత్యం ప్ర‌జ‌ల‌తోనే ఉన్నారు. హైద‌రాబాద్ పారిపోయిన చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు  మాకు నీతిక‌థ‌లు చెబుతున్నారు. పోల‌వ‌రం గురించి టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఆ రోజు పోల‌వ‌రం సోమ‌వారం అని భ‌జ‌న చేసిన వాళ్లు..జ‌యం జ‌యం చంద్ర‌న్న అని పాట‌లు పాడి ప్రాజెక్టు నిర్మాణాన్ని విస్మరించారు.
ఇటీవ‌ల చంద్ర‌బాబు ఐ టీడీపీ మీటింగ్ పెట్టి..ఆదాయ వ‌న‌రులు అన్వేషిస్తాన‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చెబుతున్నాడు. టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో మొత్తం దోచుకున్నారు. మా ప్ర‌భుత్వం రూ.1కోటి 35 ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల ద్వారా నేరుగా అందించింద‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ వివ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top