నరేగా ఫండ్స్ అన్నీ తినేసింది టీడీపీ నేతలే

- జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే
 

 

ఉపాధి హామీ పథకం నరేగా ఫండ్స్ అన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తేనె నాకినట్టు నాకేసారు. నాటి పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పప్పుబెల్లాల్లాగా తెలుగుదేశం నాయకులు పంచుకుని దోచేసుకున్నారు. ఇప్పుడు కూడా గతంలో మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నాయకుడు ఒకరు కాంట్రాక్టర్లతో ఒక వింగ్ ఏర్పాటు చేసాడు. 10 లేదా 15 శాతం నాకిస్తానంటే ప్రభుత్వం మీద మేం ఒత్తిడి చేసి, ధర్నాలు చేసి, డబ్బులిప్పిస్తాం అని వాళ్ల నుంచి కూడా మళ్లీ వసూళ్లు చేసే పనిలో ఉన్నాడు. ఉపాధి హామీ పథకం కింద గత పంచాయితీ శాఖా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వేయించిన రోడ్లు నాణ్యత లేవు.  విజిలెన్స్ ఎంక్వైరీకి వెళితే రోడ్లే లేవు. అన్నీ కొట్టుకుపోయాయి. ఇందుకు కారణమైన మాజీ పంచాయితీశాఖా మంత్రిపై ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

తాజా ఫోటోలు

Back to Top